ఫ్రెంచ్ కు చెందిన బహుళజాతి ఐటీ సేవలు, కన్సల్టింగ్ కంపెనీ కేప్ జెమినీ టెక్నాలజీ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్.. హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో ఉన్న తన కార్యాలయ లీజును పునరుద్ధరించింది. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు ఆఫీసు స్పేస్ లను జీఏఆర్ అండ్ సన్స్ బిల్డర్స్ నుంచి ఐదేళ్ల కాలానికి పునరుద్ధరిస్తూ ఒప్పందం చేసుకుంది. లక్ష్మీ ఇన్ఫోభాన్ భవనం మూడో టవర్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐదో అంతస్తు వరకు 2,27,569 చదరపు అడుగుల స్పేస్ ఉంది. ఈ లీజు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైంది.
నెలకు చదరపు చదరపు అడుగుకు రూ.34.5 చొప్పున రూ.78.5 లక్షల అద్దె చెల్లించేటట్టుగా ఒప్పందం చేసుకుంది. ఇదే టవర్లోని ఆరు, ఏడు అంతస్తులోని 86,810 చదరపు అడుగుల స్పేస్ ను ఆగస్టు 15 నుంచి లీజుకు తీసుకున్నట్టు ఉంది. దీనికి చదరపు అడుగుకు రూ.41.4 చొప్పున నెలకు రూ.35.9 లక్షలు చెల్లించాల్సి ఉంది. రెండు ఒప్పందాల్లోనూ సాధారణ ప్రాంతాలకు చదరపు అడుగుకు రూ.11.49 చొప్పున అదనంగా నిర్వహణ చార్జీలు ఉన్నాయి. అలాగే ఏడాది తర్వాత 15 శాతం, 36 నెలల తర్వాత మరో 15 శాతం అద్దె పెరుగుతుంది. రెండు ఒప్పందాలకు రూ.13 కోట్లు డిపాజిట్ గా ఆ కంపెనీ చెల్లించింది.
This website uses cookies.