పలు లోటుపాట్లు కలిగి ఉన్న 313 ప్రాజెక్టులకు రెరా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రాజెక్టుల్లో రెరా ఆడిటింగ్ నిర్వహించింది. ఆడిటింగ్ సంస్థ ప్రాజెక్టుల్లో కూలంకషంగా ఆడిటింగ్ నిర్వహించి, పలు లోటుపాట్లను గుర్తించింది. వాటిని పేర్కొంటూ ఓ నివేదికను రెరాకు సమర్పించింది. దానిని పరిశీలించిన అనంతరం మహా రెరా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా డెవలప్ వెచ్చించానని చెబుతున్న వ్యయానికి, క్షేత్ర స్థాయి పరిస్థితికి పొంతన లేదని నివేదికలో పేర్కొన్నారు. చాలామంది డెవలపర్లు మొత్తం బడ్జెట్ లో 75 శాతం సొమ్ము వెచ్చించినట్టు చెప్పారని.. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే సగం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని వివరించారు. అలాగే ప్రాజెక్టును పూర్తి చేసే తేదీ విషయంలో కూడా గందరగోళం ఉందని తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా ఆరు నెలల గడువు కూడా లేదని, కానీ ఆయా ప్రాజెక్టులు సగం కూడా పూర్తి కాలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 313 ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన రెరా.. ఆయ ప్రాజెక్టుల్లో అవకతవకలను నిర్ధారించేందుకు నిపుణులను పంపించాలని నిర్ణయించింది.
This website uses cookies.