Categories: Rera

అక్రమ వెంచర్లపై రెరా నజర్

అక్రమంగా ప్లాట్లను అబివృద్ధి చేసి విక్రయించాలని భావించేవారికి చెక్ పెట్టే దిశగా రెరా పావులు కదుపుతోంది. స్థానిక సంస్థలు లేదా సంబంధిత రెగ్యులేటరీ అథార్టీ నుంచి అనుమతి పొందకుండా పనులు చేపట్టిన ప్రాజెక్టులపై చర్యలు మొదలు పెట్టింది.

నిబంధనల ప్రకారం అన్ని ప్లాట్ల అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక సంస్థలు లేదా స్థానిక అథార్టీ నుంచి అనుమతులు పొందాలి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్ల అభివృద్ధి ప్రాజెక్టులు కె-రెరా నుంచి రిజిస్ట్రేషన్ పొందాలి. అయితే, ఈ నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తున్నట్టు రెరా గుర్తించింది. ఈ మేరకు పలువురు కొనుగోలుదారులు ఫిర్యాదులు చేయడంతో అక్రమ బిల్డర్లపై చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కంటే సంబంధిత భూ యజమానులపైనే చర్యలు తీసుకునే విధంగా కె-రెరా ముందుకు వెళుతోంది. అంటి అక్రమ ప్రాజెక్టుల విషయంలో సదరు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధించనున్నట్టు కె-రెరా చైర్మన్ పీహెచ్ కురియన్ చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని ప్లాట్ల అభివృద్ధి ప్రాజెక్టులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఆయన స్పష్టం చేశారు.

* ఇలాంటి అక్రమ వెంచర్లు మన రాష్ట్రంలో కూడా కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ, మన రెరా వీటిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కేరళ రెరా చర్యలు తీసుకుంటున్న తరహాలో ఇక్కడ కూడా అలాంటి అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.

This website uses cookies.