Categories: LATEST UPDATES

రియాల్టీలో పెట్టుబడి పెడుతున్నారా?

రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ లాభదాయకంగానే ఉంటుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ రంగం భలే పుంజుకుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

రియల్ ఎస్టేట్ మార్కెట్ శరవేగంగా పుంజుకున్నప్పటికీ, ఈ రంగంలో పెట్టుబడులు చక్కని ప్రగతి సాధించాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. అయితే, మీ సొంత ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడం ద్వారా వేగంగా ఆదాయం పొందొచ్చు. ఈ కారణంగా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి కంటే వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఏ రకమైన పెట్టబడి విషయంలోనైనా ముందుగా సంబంధిత నిపుణులను సంప్రదించాలి. ‘ఏదైనా సంస్థ యొక్క విశ్వసనీయతను తెలుసుకోవాలంటే సోషల్ నెట్ వర్క్ లలో వెతకడం, ఆ సంస్థ వెబ్ సైట్ ను చూడటం, సదరు కంపెనీ ప్రస్తుతం చేస్తున్న, గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను పరిశీలించడం, ప్రత్యేక కన్సల్టెంట్ లేదా ప్రాజెక్టు మేనేజర్ తో నేరుగా మాట్లాడటం, స్నేహితులు లేదా పరిచయస్తుల నుంచి ఆ సంస్థ వివరాలు తెలుసుకోవడం ఉత్తమ మార్గాలు’ అని నిపుణులు చెబుతున్నారు.

ఇక గ్రీన్ బిల్డింగ్ పర్యావరణ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో దేశంలో వాటికి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా అద్దెకు తీసుకునేటప్పుడు ధర కంటే ఈ అంశాన్ని ఎక్కువగా పరిగణించాలి. ఇంధన వినియోగం, భవనం యొక్క జీవితకాల ఖర్చులు, నిర్వహణ ఖర్చులను కూడా పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకుంటారని.. అందువల్ల బహుళ ప్రయోజనాలు అందించే గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమైన నిర్ణయమని చెప్పొచ్చు.

This website uses cookies.