దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో ఉత్తరప్రదేశ్ రెరా టాప్ లో నిలిచింది. మొత్తం ఫిర్యాదుల్లో 41 శాతం ఫిర్యాదులను పరిష్కరించి తొలి స్థానంలో నిలిచినట్టు యూపీ రెరా చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. అసోచామ్ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రెరా అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు లక్ష ప్రాజెక్టులు, 71,514 మంది ఏజెంట్లు అందులో నమోదు అయ్యారు.
ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు లక్షకు పైగా ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. ప్రాజెక్టులకు సంబంధించి 39 శాతంతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు (13 శాతం), గుజరాత్ (11 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఏజెంట్ల సంఖ్య 2019 జనవరిలో 33,270 ఉండగా.. 2023 జనవరి నాటికి 71,514కి పెరిగింది.
This website uses cookies.