కొందరు బిల్డర్లు న్యాయపరంగా చిక్కులున్న స్థలాల్లో అపార్టుమెంట్లను ప్రకటించి.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించి.. వాటికి కట్టకుండా చేతులెత్తేస్తుంటారు. మరికొందరేమో.. అపార్టుమెంట్‌ను అద్భుతంగా కడతామని ప్రచారం చేస్తారు.. తీరా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే లీకేజీలు స్వాగతం పలుకుతాయి. ఫ్లోరింగ్ సరిగ్గా ఉండదు. బాత్‌రూముల్లో నాసిరకమైన సానిటరీ ఫిట్టింగుల్ని ఏర్పాటు చేస్తారు.. విద్యుత్తు వైరింగ్ కూడా సరిగ్గా చేయరు. మరి, ఇలాంటి సమస్యలకు రెరా పరిష్కరిస్తుంది.
కాకపోతే, కొన్ని సందర్భాల్లో బిల్డర్లు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనూ బయ్యర్లకు ప్రయోజనం కలిగించేదీ ట్రిబ్యునలే. ఏదైనా రియాల్టీ సంస్థ నుంచి ఇబ్బందులు, మోసాలు ఎదురైన సమయంలో రెరా నుంచి న్యాయం జరగనప్పుడు.. అప్పీలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కోర్టులతో పోలిస్తే ట్రిబ్యునల్ ద్వారా త్వరితగతిన న్యాయం జరుగుతుంది.
This website uses cookies.