నగరానికి చెందిన అన్వితా గ్రూప్.. కొల్లూరులో రెండు వేల కోట్ల బడ్జెట్‌తో ఇవానా అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 12.9 ఎకరాల్లో 1850 ఫ్లాట్లను నిర్మిస్తోంది. మొదటి దశలో.. 3.5 ఎకరాల్లో పదిహేను అంతస్తుల్లో నిర్మించిన రెండు టవర్లను 2024 డిసెంబరులో కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేస్తారు. రెండో దశలో 9.25 ఎకరాల్లో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లోపు బయ్యర్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన తెలిపారు. ప్రారంభ ఆఫర్ కింద చదరపు అడుక్కీ రూ.6,500లకు విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. నిర్మాణ వ్యయం తొలి దశ ప్రాజెక్టుకు రూ.380 కోట్లు, రెండో దశకు రూ.1,600 కోట్లకు పైగా అవుతుందని చెప్పారు.
1 నుంచి 34వ అంతస్తు వరకు 1,360-2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2-3 పడక గదులను నిర్మిస్తారు. 35-36 అంతస్తుల్లో స్కై విల్లాలు 4 బెడ్రూంలతో 2,900-5,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతంగా రానున్నాయి. కారు పార్కింగ్ స్థలం సైతం మొదట్లోనే రిజిస్ట్రేషన్ సహా అప్పగిస్తారు. ఇవానా మొదటి దశలో 8 లక్షలు, రెండవ దశలో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉంటాయని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు.
This website uses cookies.