Categories: TOP STORIES

బాధితుల‌కు రెరా అండ‌గా నిలుస్తుంది!

  • టీఎస్ రెరా ఛైర్మ‌న్ డా. ఎన్‌. స‌త్య‌నారాయ‌ణ

టీఎస్ రెరా కార్యాల‌యంలో 77వ భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు మంగ‌ళ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. మాసబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ కార్యాలయ భవన సముదాయంలోని “రెరా” కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రీలాంచుల్ని నిర్వ‌హించే సంస్థ‌ల‌కు నోటీసుల‌ను అంద‌జేస్తున్నామ‌న్నారు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న రెరా చట్టం కట్టుదిట్టంగా అమలు చేయడానికి సిబ్బంది సమిష్టి కృషితో పని చేయాలని కోరారు. రియల్ ఎస్టేట్ రంగానికి సామర్థ్యంతో పాటు పారదర్శకత జవాబుదారితనం తీసుకురావడానికి “రెరా” లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారంలో పౌరులకు రెరా మద్దతుగా నిలుస్తోందని ఆయన అన్నారు. రెరా అనుమతిలేని ప్రాజెక్టులలో కష్టపడి జీవితకాలం సంపాదించిన సొమ్మును పెట్టుబడి పెట్టి మోసపోరాదని, ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. బాధతో వచ్చిన బాధితులకు రెరా చట్టం అండ కావాలని, రెరాలో పని చేసే అధికారులు, సిబ్బంది సామాజిక బాధ్యతగా భావించి విధులు నిర్వహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రెరా సభ్యులు కె. శ్రీనివాసరావు, జె. లక్ష్మీనారాయణ, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, అశ్విని, రవీందర్, సత్తయ్య, జగదీష్, అంజయ్య, చక్రధర్, పద్మావతి, గోపాల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

This website uses cookies.