యూకేలో గృహాల ధరలు వార్షికంగా 10.9% చొప్పున పెరిగాయి. ఇది దాదాపు ఏడు సంవత్సరాలలో అత్యధికమని చెప్పొచ్చు. మహమ్మారి తరువాత ప్రజలు కొత్త గృహాలను కొనుగోలు చేసే క్రమంలో రేట్లు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి పన్ను ప్రోత్సాహకం పొడిగింపు లేకుండానే కొత్త ఇళ్లను కొంటామని ప్రతి పది మందిలో ఏడు మంది ఒక సర్వేలో తెలిపారు.
మహమ్మారి నేపథ్యంలో ప్రజలు తమ అవసరాలను తిరిగి అంచనా వేస్తూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ రాబర్ట్ గార్డనర్ అన్నారు. కరోనా ఆరంభ దశలలో గృహ మార్కెట్ బలహీనంగా ఉంది. కాకపోతే, రానున్న నెలల్లో వార్షిక గృహాల ధరల పెరుగుదల మరింత వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.