షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ హైదరాబాద్ లోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో తన వాటాను రూ.2,200 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. టీఎస్ఐ బిజినెస్ పార్క్స్ (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్ఐబీపీహెచ్) లోని ఈ వాటాలను సింగపూర్ కు చెందిన జీఐసీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
2019 డిసెంబర్ లో టీఎస్ఐబీపీహెచ్ లోని వాటాలను షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్, అలియాంజ్ రియల్ ఎస్టేట్ సంయుక్త భాగస్వామి కంపెనీ ఎస్పీఆర్ఈఎఫ్-2 తీసుకుంది. గచ్చిబౌలిలో 2.4 మిలియన్ చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించిన ఐటీ స్పెషల్ సెజ్ వేవ్ రాక్.. టీఎస్ఐబీపీహెచ్ సొంతం. ఈ నేపథ్యంలో వేవ్ రాక్ లోని ఈ వాటాను జీఐసీకి విక్రయించారు.