గ్రేటర్ టొరంటోలో ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. ఆగస్టుతో పోలిస్తే ఇళ్ల సగటు అమ్మకం ధర కాస్త పెరగడంతో సెప్టెంబర్ లో ఇళ్ల అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. ఏడాది క్రితంతో పోలిస్తే టొరంటో ప్రాంతంలోని ఇళ్ల అమ్మకాలు 44.1 శాతం పడిపోయాయి. అదే ఈ ఏడాది ఆగస్టుతో చూస్తే 10.5 శాతం తగ్గుదల కనిపించింది. కొత్త లిస్టింగులు గత సెప్టెంబర్ తో పోలిస్తే 16.7 శాతం తగ్గగా.. క్రియాశీల లిస్టింగులు 47.3 శాతం పెరిగాయి.
ఆగస్టుతో పోలిస్తే ఇక్కడ ఇళ్ల సగటు అమ్మకం ధర 0.7 శాతం పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ధర 4.3 శాతం తక్కువే అయినప్పటికీ, ఇళ్ల అమ్మకాలు మాత్రం తగ్గాయి. బ్యాంక్ ఆఫ్ కెనడా తన పాలసీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో 3.25 శాతానికి చేరింది. ఇది 14 ఏళ్ల గరిష్టం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా.
This website uses cookies.