poulomi avante poulomi avante

సంగారెడ్డి.. గ్రోత్‌కి రెడీ!

ట్రిపుల్ ఆర్‌తో సంగారెడ్డి
రియాల్టీకి గిరాకీ ఖాయ‌మేనా!

ఏయే ప్రాంతాల్లో ఎంతెంత ధ‌ర‌?

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి రీజినల్ రింగ్ రోడ్డు మరో మణిహారంగా మారనుంది. తెలంగాణ అభివృద్ధిలో ట్రిపుల్ ఆర్ గేమ్ ఛేంజర్ కానుందని రియల్ ఎస్టేట్‌ వర్గాలు ఇప్ప‌టికే అంచనా వేస్తున్నాయి. మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అందుకు సంబంధించిన‌ భూసేకర‌ణ‌ పనులు మొదలవ్వగా, టెండర్లు ఆహ్వానించేందుకు ప్ర‌భుత్వం సిద్దమవుతోంది.

హైదరాబాద్ నగరం చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఉండగా.. దీని వెలుపల రీజినల్ రింగ్ రోడ్‌‌ నిర్మాణం జ‌రుగుతుంది. ఓఆర్ఆర్‌కు వెలుపల 347 కిలోమీటర్ల మేర.. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ ప్రాంతీయ రింగ్ రోడ్డు ఏర్పాటు అవుతోంది. మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డిలో నిర్మించే భారీ జంక్షన్ కార‌ణంగా.. అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ చేంజర్స్ నిర్మించేలా డిజైన్ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జ‌రుపుకునే ఈ భారీ ఇంటర్ చేంజర్స్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ముంబై జాతీయ రహదారిపై.. నేషనల్ హైవే 65 ను కనెక్ట్ చేస్తూ సంగారెడ్డి దగ్గర నిర్మించే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాట‌వుతాయ‌ని అంచ‌నా. ఇప్పటికే ఇటు పటాన్ చెరు నుంచి జహీరాబాద్ వరకు పారిశ్రామికంగా అభివృద్ది చెందగా.. తాజాగా రీజినల్ రింగ్ రోడ్డు, సంగారెడ్డి దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించి జాతీయ రహదారిపై సంగారెడ్డికి సమీపంలో మార్కింగ్ చేయగా.. భూసేకరణ పనులు మొదలయ్యాయి. దీంతో సంగారెడ్డి సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. సంగారెడ్డి, జహీరాబాద్ మధ్య మొన్నటి వరకు నేషనల్ హైవే ఫెసింగ్ తో ఎకరం 1.5 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలు ఉండగా..

ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు కానుండటంతో ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం 70 లక్షల నుంచి కోటీ రూపాయలు మేర ధరలున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే సంగారెడ్డికి సమీపంలోని సదాశివపేట, ఆరూర్, బుదేరా, జహీరాబాద్ వరకు ఇప్పటికే రియల్ వెంచర్లు వెలిశాయి. ప్రస్తుతం సంగారెడ్డి లో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 12 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ధరలున్నాయి. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చదరపు గజం రూ. 8 నుంచి 22 వేల దాకా ప్లాట్ల ధరలున్నాయి. సంగారెడ్డి సమీపంలోని సదాశివపేట్ లో చదరపు గజం 6వేల నుంచి 14 వేల దాకా చెబుతున్నారు. జహీరాబాద్ లో డీటీసీపీ లేఅవుట్లలో చదరపు గజం 12 వేల నుంచి 26 వేలు ఉంది.

సంగారెడ్డి కి రెండు వైపులా ఇటు పటాన్ చెరు, అటు జహీరాబాద్ వరకు భారీ ఎత్తున పలు రంగాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్దం చేసింది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఫార్మా కంపెనీలు రీజినల్ రింగ్ రోడ్డుకు చేరువగా తమ ల్యాబ్‌లు, ఫ్యాక్టరీలను త‌రిలిస్తుండ‌టంతో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో సంగారెడ్డి జంక్షన్ అంచ‌నాల‌కు మించి అభివృద్ది చెందుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles