poulomi avante poulomi avante

క‌స్ట‌మ‌ర్ల సంతృప్తి.. నిర్మాణాల్లో నాణ్య‌తే ధ్యేయంగా 30 ఏళ్లుగా రియ‌ల్ సేవ‌లు

shanta sriram constructions md m narsaiah success story

  • 80కిపైగా ప్రాజెక్టులు పూర్తి
  • ప‌ది వేల‌కు పైగా హ్యాపీ క‌స్ట‌మ‌ర్లు
  • కొత్త‌గా వినూత్న ప్రాజెక్టులు..

ఆఫీసులో ప‌ని చేసేట‌ప్పుడు ఒక చిన్న గొడ‌వ‌.. ఆయ‌న జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది. క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం గ‌ల ఆయ‌న‌కు సోద‌రుడు కూడా తోడు కావ‌డంతో.. ఇంకేముంది.. ఇద్ద‌రు అలుపెర‌గ‌క క‌ష్ట‌ప‌డ్డారు.. చిన్న చిన్న ప్రాజెక్టుల‌తో ప్ర‌స్థానాన్ని ఆరంభించి.. క‌స్ట‌మ‌ర్ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ప్ర‌తిఒక్క‌రికీ అందుబాటులో ఉంటూ.. ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రిస్తూ.. 1995లో ఆరంభ‌మైన ప్ర‌యాణం.. ఎన‌భైకి పైగా ప్రాజెక్టులు పూర్తి.. ప‌దివేల‌కు పైగా హ్యాపీ క‌స్ట‌మ‌ర్లు.. ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూస్తే.. గొప్ప సంతోషం.. ఎక్క‌డ్లేని సంతృప్తి.. శాంతాశ్రీరాం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ ఎం న‌ర్స‌య్య‌ను ఇటీవ‌ల రియ‌ల్ ఎస్టేట్ గురు ప‌ల‌క‌రించింది. రియ‌ల్ టాక్స్ విత్ కింగ్‌ జాన్స‌న్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని పంచుకున్నాడు. మ‌రి, ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం..

ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో నెలకు రూ.900 జీతంతో మొదలైన ఆయన కెరీర్.. ఐదేళ్లకే మలుపు తిరిగింది. జాబ్ మానేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ వెంటనే కన్ స్ట్రక్షన్ కంపెనీ స్థాపించి.. తొలుత రెండు ఇళ్లతో రియల్ జర్నీ మొదలుపెట్టారు. అంతే ఇక వెనుతిరిగి చూడలేదు. 30 ఏళ్లుగా ఆ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతోంది. వేల అపార్ట్ మెంట్లు.. 50 లక్షలకు పైగా చదరపు అడుగుల్లో కమర్షియల్ ప్రాజెక్టులు.. మల్టీ ప్లెక్స్ లు.. ఐటీ పార్కులు.. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు.. అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు. కస్టమర్ సంతృప్తే ధ్యేయంగా.. నిర్మాణంలో నాణ్యతే పరమావధిగా ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా తన కస్టమర్లందరినీ కుటుంబ సభ్యులుగా భావించి వారితో ప్రయాణం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదీ శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ఎండీ నర్సయ్య సక్సెస్ స్టోరీ. రియల్ జర్నీ ప్రారంభించి 30 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి ఇటీవ‌ల అడుగుపెట్టారు.

నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా దురాజ్ పల్లికి చెందిన నర్సయ్య తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. సూర్యాపేటలో పదో తరగతి వరకు చదివిన ఆయన.. నల్లగొండలో సివిల్ ఇంజనీరింగ్ లో పాలిటెక్నిక్ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి జాబ్ లో జాయిన్ అయ్యారు. రిమాక్స్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తూనే సాయంత్రం సమయాల్లో జేఎన్ టీయూలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 1990లో రూ. 600 వేతనంతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. 1994లో బీటెక్ పూర్తి చేశారు. ఆఫీసులో చిన్న సమస్య రావడంతో 1995లో రిజైన్ చేశారు. ఆ సమయానికి ఆయన వేతనం రూ. 2500. జాబ్ మానేసిన తర్వాత కొంత‌కాలం రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేశారు. తర్వాత బోయినపల్లిలో రెండు ఇళ్లను నిర్మించడం ద్వారా కన్ స్ట్రక్షన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. తన తల్లిదండ్రుల పేర్లతో శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ మొదలుపెట్టారు.

ఫ‌స్ట్ అపార్టుమెంట్‌

తొలుత మెహదీపట్నం ఎల్ఐసీ కాలనీలో ఎనిమిది ఫ్లాట్లతో అపార్ట్ మెంట్ ను విజయవంతంగా పూర్తి చేశారు. అప్పుడు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.400 కాగా, రూ.600 రేటుతో విక్రయించారు. ఇది పూర్తయిన తర్వాత మారేడుపల్లిలో 15 ఫ్లాట్లతో మరో ప్రాజెక్టు ప్రారంభించారు. ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. ఒక్క మారేడుపల్లిలోనే 13 వెంచర్లు పూర్తి చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటించడం.. కస్టమర్ల సంతృప్తే ధ్యేయంగా పలు చర్యలు చేపట్టడం.. ముఖ్యంగా వారు ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పటితో పోలిస్తే.. స్వాధీనం చేసే సమయానికి దాని విలువ కనీసం 50 శాతం పెరిగేలా చేయడం ద్వారా నమ్మకమైన బిల్డర్ గా పేరు సంపాదించుకున్నారు. పైగా కస్టమర్లు-బిల్డర్ అనే బంధం కాకుండా వారందరినీ తన కుటుంబ సభ్యులు మాదిరిగా చూసుకునేవారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి పనినీ వారితో సంప్రదించి, ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాలను చూపించేవారు. తద్వారా కస్టమర్లు చాలా సంతోషంగా ఉండేవారు. అందుకే 25 ఏళ్ల క్రితం శాంతా శ్రీరామ్ ప్రాజెక్టులో కొనుగోలు చేసినవారు ఇప్పటికీ వీరితో తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. మారేడుపల్లిలో నిర్మించిన ప్రాజెక్టులను అప్పట్లో చదరపు అడుగును రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయించారు. ఇప్పటికీ ఆ భవనాలు కొత్తవిగా కనిపిస్తాయి. ప్రస్తుతం వాటి ధర చదరపు అడుగుకు రూ.10వేలకు పైనే ఉంది. తార్నాకలో మెహతాబ్ ఆర్కేడ్ పేరుతో చేపట్టిన కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు బాగా సక్సెస్ అయింది. తర్వాత తార్నాకలోనే మరో రెండు ప్రాజెక్టులు పూర్తి చేశారు. అలాగే పద్మారావునగర్ లో పది ప్రాజెక్టులు నిర్మించారు.
జూబ్లీహిల్స్ లో పది పన్నెండు ప్రాపర్టీలు తీసుకుని వెంచర్లు వేశారు. నీరూస్ బిల్డింగ్, రోషన్ గార్మెంట్స్ ఉన్న భవనం, వరమహాలక్ష్మి సిల్క్స్, తనిష్క్ షోరూం, ఆంచల్ షోరూం, పి.సత్యనారాయణ జ్యువెలర్స్ ఉన్న భవవనాలన్నీ శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ నిర్మించినవే. అలాగే సీఎం క్యాంపు ఆఫీస్ ఎదురుగా బ్లూమూన్ హోటల్ ఉండేది. ప్రస్తుతం అది తనిష్క్ షోరూం అయింది. దాంతోపాటు మలబార్ గోల్డ్ షోరూం, పంజగుట్ట బజాజ్ ఎలక్ట్రానిక్స్, డీఎల్ఎఫ్ పక్కన శాంతాశ్రీరామ్ టెక్ పార్క్, సుదర్శన్ థియేటర్ మల్టీ ప్లెక్స్, ఓడియన్ థియేటర్ మల్టీ ప్లెక్స్, ప్యాట్నీ సర్కిల్ లో మల్టీ ప్లెక్స్.. ఇలా చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు. కరోనా కారణంగా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణం ఆలస్యమైంది. ఇక వీరి ఐకానిక్ ప్రాజెక్టు విషయానికి వస్తే.. అది గచ్చిబౌలిలోని స్కైసిటీ ఐటీ పార్క్. దాదాపు పదిన్నర ఎకరాల స్థలంలో వాసవి గ్రూప్ తో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.

మ‌ణికొండ‌.. కిస్మ‌త్‌పూర్‌..

తాజాగా మణికొండ, కిస్మత్ పూర్ లో విల్లా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రస్తుతం బోధివృక్ష పేరుతో తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఓ అపార్ట్ మెంట్ ప్రాజెక్టు కడుతున్నారు. ఇందులో 800 ఫ్లాట్లు ఉండగా.. పచ్చదనం కోసం 800 చెట్లు కూడా నాటారు. 2026 డిసెంబర్ నాటికి దీనిని పూర్తి చేసి స్వాధీనం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. ఇందులో ఫ్లాట్ల ధరలు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల మధ్యలో ఉంటుంది. దాదాపు రెండు మూడు కోట్ల రూపాయల విలువ చేసే అపార్ట్ మెంట్లలో ఉండే లగ్జరీ సౌకర్యాలను తాము ఇందులో పొందుపరుస్తున్నామని నర్సయ్య చెప్పారు. అలాగే కల్పవృక్షలో ఫ్లాట్ల ధరలు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటాయని.. ఇందులో కూడా రూ.కోటిన్నర విలువ చేసే అపార్ట్ మెంట్లలో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు 8వేలకు పైగా అపార్ట్ మెంట్లు.. 50 లక్షల చదరపు అడుగులకు పైగా కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తిచేసిన శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్.. పలు సందర్భాల్లో సవాళ్లు కూడా ఎదుర్కొంది.

ఇబ్బందులూ ఉన్నాయ్‌!

2007-08లో ఓసారి, తెలంగాణ ఉద్యమ సమయంలో మరోసారి, కరోనా సమయంలో ఇంకోసారి ఇబ్బందులు పడింది. బిజినెస్ ఘోరంగా పడిపోయింది. అయినప్పటికీ, అనతికాలంలోనే తేరుకుని సమర్థవంతంగా నిలబడింది. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రీ సేల్స్ చేయకపోవడం.. అన్ని అనుమతులూ తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు లాంచ్ చేయడం.. కస్టమర్ల సంతృప్తే ధ్యేయంగా పనులు చేయడం వంటి అంశాలు ఈ కంపెనీని అప్రతిహాతంగా ముందుకు నడిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనడానికి ఇది మంచి సమయమని.. ప్రస్తుతం 10 నుంచి 15 శాతం మేర తక్కువ ధరలున్నాయని చెప్పిన ఆయన.. హైదరాబాద్ మార్కెట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లోనే రియల్ ధరలు తక్కువనే విషయాన్ని ప్రస్తావించారు. రియల్ రంగంలో రీజనల్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజర్ కానుంద‌ని పేర్కొన్నారు. ఇక హైరైజ్ టవర్లలో అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ తో ఇబ్బందులు ఉంటాయని.. అలాంటి ప్రాజెక్టుల్లో ఎకరానికి 2.5 లక్షల చదరపు అడుగుల నుంచి 3 లక్షల చదరపు అడుగుల వరకు పరిమితి విధిస్తే బాగుంటుందని సూచించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles