Categories: LATEST UPDATES

గృహరుణాల్లో ఎస్బీఐ దూకుడు

  • రూ.6 లక్షల కోట్ల మార్కు
    దాటిన బ్యాంకింగ్ దిగ్గజం

భారతదేశ అతిపెద్ద బ్యాంకు దిగ్గజం.. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) గృహ రుణాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా రూ.6 లక్షల కోట్ల మార్కు దాటి అదే వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించి 8.4 శాతం చేయడంతోపాటు వచ్చే ఏడాది జనవరి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్లకు కూడా తక్కువ వడ్డీ వర్తింపజేయనున్నట్టు పేర్కొంది.

2021 జనవరిలో రూ.5 లక్షల కోట్ల మార్కు దాటిన ఎస్ బీఐ.. తాజాగా రూ.6 లక్షల కోట్ల మార్కు దాటిందని, గృహ రుణాల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాంకు ఎస్ బీఐ అని వివరించింది. ఈ నేపథ్యంలో పండగ బోనాంజా తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇందులో భాగంగా గృహ రుణాలపై 0.25 శాతం, టాప్ అప్ రుణాలపై 0.15 శాతం, ఆస్తి రుణాలపై 0.30 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్ బీఐకి 28 లక్షల మందికి పైగా గృహ రుణాల వినియోగదారులు ఉన్నారని బ్యాంకు ర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. కాగా, కొత్త గృహ రుణాలు, టేకోవర్ కొనుగోలుదారులకు వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతుందని.. టాప్ అప్ రుణాల వడ్డీ రేటు 8.8 శాతం నుంచి మొదలవుతుందని ఎస్ బీఐ రిటైల్ బ్యాంకింగ్, ఆపరేషన్స్ ఎండీ అలోక్ కుమార్ చౌదరి తెలిపారు.

This website uses cookies.