ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో ఉన్న అంశంపై దృష్టి పెట్టడంతోపాటు పనులు పూర్తి చేయని డెవలపర్లపై ఇళ్ల కొనుగోలుదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయాల్లో డెవలపర్లను బాధ్యులుగా చేసే విధంగా కొత్త విధానం తీసుకురానున్నారు. ఇందులో భారీ జరిమానాలు వేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఎస్టీపీకి సంబంధించిన పనులు చేయకపోవడం, క్లబ్ హౌస్ లేదా ఇతర హైరైజ్ సౌకర్యాలు కల్పించకపోతే రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా అవసరమైతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు రద్దు చేయడం, చెల్లించాల్సన బకాయిలపై వడ్డీ విధించడం, సేల్స్ ఆఫీసులు, ఖాళీ యూనిట్లకు సీల్ వేయడం వంటివాటిపైనా ఆలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ముసాయిదా విధానం వెలువడనుంది.
This website uses cookies.