Categories: LATEST UPDATES

సెలబ్రిటీల కిచెన్స్ చూస్తారా?

సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి అంశమూ ఆసక్తే. వారు ఎలా ఉంటారు? ఏం తింటారు? వారి ఇళ్లు ఎలా ఉంటాయి వంటి విషయాలపై అందరికీ ఆసక్తి సహజం. మరి సెలబ్రిటీల కిచెన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? రండి చూద్దాం.

ప్రియాంకా చోప్రా.. అంతా నేచురల్..

 

నటి ప్రియాంకా చోప్రా కిచెన్ మొత్తం చాలా నేచురల్ డిజైన్ తో ఉంటుంది. ఉడెన్ ఫినిష్ కేబినెట్లు, బిల్ట్ ఇన్ స్టోరేజ్ యూనిట్లు, బ్రేక్ ఫాస్ట్ కౌంటర్, మాడ్యులర్ కిచెన్.. ఇలా కంటికి ఇంపైనా సహజసిద్ధమైన రంగుల్లో అదిరిపోతుంది.

రజనీకాంత్.. ఎంతో స్పేసియస్

రజనీ అంటేనే ప్రత్యేకం. మరి ఆయన కిచెన్ ఇంకా ప్రత్యేకం. ఎతో స్పేసియస్ గా.. అద్భుతమైన ఇంటీరియర్స్ తో ఔరా అనిపించక మానదు. గ్లాస్ కేబినెట్లు, బిల్డ్ ఇన్ అప్లైయెన్స్ యూనిట్లు, హ్యాండిల్ లెస్ డిజైన్లతో మెరిసిపోతూ కనిపిస్తుంది.

ఫ్రీడా పింటో.. కళ్లు తిప్పుకోలేం

ఫ్రీడా పింటో కిచెన్ లోకి వెళితే కళ్లు తిప్పుకోలేం. స్వర్గంలో కూర్చుని వంట చేసిన అనుభూతి కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. రంగులు కేబినెట్లు మోడరన్ లుక్ ఇవ్వగా.. రోజ్ గోల్డ్ ఫిట్టింగులు పురాతన శైలిని గుర్తుకు తెస్తాయి.

This website uses cookies.