poulomi avante poulomi avante

ఈస్ట్‌.. వెస్ట్‌.. ఏకకాలంలో వాసవి ఆకాశ‌హ‌ర్మ్యాలు..

  • హైద‌రాబాద్‌లో అరుదైన ఘ‌న‌త‌
  • సాధించిన వాస‌వి గ్రూప్‌
  • నాలుగువైపులా ఆకాశ‌హ‌ర్మ్యాలు
  • ఏడాదిలోపు హ్యాండోవ‌ర్‌

నిర్మాణ రంగంలో ఓ ప్రాజెక్టును టేకప్‌ చేసి దాన్ని కంప్లీట్‌ చేయడమే పెద్ద అచీవ్‌మెంట్‌. అలాంటిది వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకాశ‌హ‌ర్మ్యాల్ని చేపట్టడమంటే ఆషామాషీ వ్యవహార‌మేం కాదు. కానీ, అలాంటి బిగ్‌ టాస్క్‌లను సింగిల్‌ హ్యాండ్‌తో వాస‌వి గ్రూప్ చేసి చూపిస్తోంది. అటు ఈస్ట్‌.. ఇటు వెస్ట్‌ ఏట్ ఏ టైమ్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులను నిర్మిస్తోన్న ఏకైక కంపెనీగా రికార్టును సృష్టిస్తోంది. ఈస్ట్‌సైడ్‌ ఉన్న ఉప్పల్‌లో వాసవీ క్రౌన్ ఈస్ట్‌తో తూర్పు హైద్రాబాద్‌కే కొత్త హంగులు తెస్తుంటే.. వాసవీ అట్లాంటిస్‌తో వెస్ట్‌సైడ్‌ కొత్త హిస్టరీ క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతోంది.

ఒక ప్రాజెక్టును టేకప్‌ చేసి దాన్ని కంప్లీట్‌ చేయడానికే కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు నానా హైరానా పడిపోతుంటారు. నిర్మాణ రంగంలో సౌతిండియాలోనే వన్ ఆఫ్‌ ద బెస్ట్ నిర్మాణ సంస్థ‌గా గుర్తింపు పొందిన వాసవీ గ్రూప్‌ మాత్రం ఇందుకు మినహాయింపనే చెప్పాలి. జోన్ల వారీగా.. ప్రాంతాల వారీగా ప్రతిష్టాత్మక నిర్మాణాలను ప్రారంభించిన వాసవీ గ్రూప్- వాటిని పూర్తి చేసే విషయంలోనూ అదే నిబద్ధతను చూపిస్తోంది. వాసవీ అప్‌ కమింగ్ ప్రాజెక్టుల్లో తూర్పు హైద్రాబాద్‌లోని వాసవీ క్రౌన్‌ ఈస్ట్‌తో పాటు పశ్చిమ హైద్రాబాద్‌లో లగ్జూరీయస్‌ వాసవీ అట్లాంటిస్‌ను సేమ్ టైమ్‌లో కంప్లీట్‌ చేయడంలో బిజీగా ఉంది.

ఒక ఏరియాలోని కన్‌స్ట్రక్షన్‌ ఎఫెక్ట్‌ మరో నిర్మాణంపై పడకుండా ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌ వాసవీ ఈజ్‌ ద బెస్ట్‌ అని దూసుకెళ్తోంది హైద్రాబాద్‌ నిర్మాణరంగంలో. ట్వంటీ ఫోర్‌ సెవన్‌.. త్రీ సిక్ట్సీ ఫైవ్ (24x 7 x365) నాన్ స్టాప్‌గా ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్‌ చేసే పనిలోనే బిజీగా ఉండటంతో వాసవీ క్రౌన్‌ ఈస్ట్‌లో ఫ్లాట్స్‌ నిర్మాణం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇక వెస్ట్‌లో కన్‌స్ట్రక్ట్‌ అవుతోన్న వాసవీ అట్లాంటిస్‌ ప్రాజెక్ట్‌లో అపార్ట్‌మెంట్స్‌ని ఏడాదిలోగా బయ్యర్లకు హ్యాండోవర్‌ చేస్తామంటోంది వాసవీ గ్రూప్. మొత్తం 10 వేల ఫ్లాట్స్‌ని కస్టమర్లకు అందించాలని తాము టార్గెట్‌గా పెట్టుకున్నామని.. తప్పకుండా లక్ష్యాన్ని అందుకుంటామని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు వాస‌వి గ్రూప్ ఎండీ ఎర్రం విజ‌య్ కుమార్‌.

వాస‌వి క్రౌన్ ఈస్ట్‌..
ఈస్ట్ ఈజ్ ద బెస్ట్‌

వాసవీ క్రౌన్‌ ఈస్ట్‌ ప్రాజెక్ట్‌తో హైద్రాబాద్‌ ఈస్ట్‌ ఈజ్‌ న్యూ వెస్ట్‌ అన్నట్టు తూర్పు హైద్రాబాద్‌ను మార్చేస్తోంది వాసవీ గ్రూప్‌. నిన్న మొన్నటి వరకు ఈస్ట్ హైద్రాబాద్‌ను పెద్దగా పట్టించుకోని వారందర్ని క్రౌన్‌ ఈస్ట్‌ నిర్మాణంతో ఈ ప్రాంతం వైపు చూసేలా చేసింది. ఉప్పల్ మెట్రో స్టేష‌న్‌కు కూత‌వేటు దూరంలో ఠీవీగా కొలువుదీరిన ఈ అప్‌ స్కేల్‌ గేటెడ్ కమ్యూనిటీలో- అంగుళం కూడా వృథాగా పోకుండా ప్రణాళికాబద్ధంగా.. పక్కా వాస్తుతో నిర్మాణాలు చేపట్టారు. టూ, త్రీ, ఫోర్‌ బీహెచ్‌కే యూనిట్లతో పాటు స్కై విల్లాలను కూడా కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు వాసవీ క్రౌన్‌ వెస్ట్‌ ప్రాజెక్ట్‌లో.

ఉప్పల్ మెట్రో స్టేష‌న్ చేరువ‌లో వాసవీ క్రౌన్‌ ఈస్ట్‌ ప్రాజెక్ట్‌
1.93 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం
2 టవర్లు.. ఒక్కో టవర్లో 34 అంతస్థులు.. మొత్తం 324 యూనిట్స్‌
ప్రైవసీకి భంగం కలగకుండా ప్రతీ ఫ్లోర్‌లో 10 ఫ్లాట్స్‌ ఉండేలా ఫ్లోర్‌ ప్లానింగ్‌

ఇళ్లు కొనాలనే కోరిక ఉంటే సరిపోదు. అది మన కలలకు తగ్గట్టే ఉందా..? బడ్జెట్‌ వర్కౌట్ అవుతుందా..? ఇంటి సైజ్‌, నిర్మాణ తీరు ఇలా అన్నీ కాలిక్యుట్‌ చేసుకోవాల్సిందే. ఇలాంటి కస్టమర్ల కోసమే వారి అభిరుచికి తగిన విధంగా టూ, త్రీ, ఫోర్ బీహెచ్‌కేతో పాటు స్కై విల్లాస్‌తో వాసవీ క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతోంది వాసవీ గ్రూప్‌. ఉప్పల్‌లో కన్‌స్ట్రక్ట్‌ చేస్తోన్న ఈ గేటెడ్‌ కమ్యూనిటీ మొత్తం విస్తీర్ణం 1.93 ఎకరాలు కాగా.. 2 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్‌లో 34 అంతస్థులు.. వాటిల్లో మొత్తం 324 యూనిట్స్‌ ఉన్నాయ్‌. మాస్టర్‌ ప్లాన్‌ చూస్తే- ప్రాజెక్ట్‌ చుట్టూ గ్రీన్‌ బోర్డర్‌ లైన్‌ డ్రా చేసినట్టు చక్కని మొక్కలు, చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

26 వేల 600 స్క్వేర్‌ఫీట్ల వైశాల్యంలో క్లబ్‌హౌస్‌, చిల్డ్రన్‌ ఏరియా, మల్టీపర్పస్‌ హాల్‌, యోగా రూమ్‌, బ్యాడ్మింటన్‌ కోర్ట్‌, క్రికెట్‌ పిచ్, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్‌, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్ ఇలా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచింది వాసవీ గ్రూప్‌. ప్రతీ ఫ్లోర్‌లో 10 ఫ్లాట్స్‌ ఉంటాయ్‌. ఇతరుల ప్రైవసీకి భంగం కలగని విధంగా ఫ్లోర్‌ ప్లాన్ డిజైన్‌ చేశారు. ఒక్కో ఫ్లోర్‌లో నాలుగు ప్యాసింజర్‌ లిఫ్ట్స్‌.. ఒక ఎమర్జెన్సీ లిఫ్ట్‌, రెండు స్టేర్‌కేసులున్నాయ్‌. ఇక 8 కిలోమీటర్ల రెడియన్స్‌లోనే స్కూల్స్‌, కాలేజీలు, ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్‌, కిలోమీటర్‌ దూరంలోనే మెట్రో స్టేషన్‌ ఉండటం వాసవీ క్రౌన్‌ ఈస్ట్‌ ప్రాజెక్ట్‌ వైపు బయ్యర్లను ఆకర్షించేలా చేస్తున్నాయ్‌.

వెస్ట్‌లో బెస్ట్‌.. వాస‌వి అట్లాంటిస్‌..

క్లాసీ కన్‌స్ట్రక్షన్‌.. వరల్డ్‌ క్లాస్‌ ఆర్కిటెక్చర్‌.. మోడ్రన్‌ టెక్నాలజీతో నిర్మాణ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది వాసవీ గ్రూప్‌. అలాంటి గ్రూప్‌ నుంచి వస్తోన్న మరో కొత్త ప్రాజెక్ట్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో నిర్మిస్తోన్న వాసవీ అట్లాంటిస్‌. స్టన్నింగ్ హై రైజ్‌ అపార్ట్‌మెంట్స్‌.. లగ్జరీ అండ్ కంఫర్ట్‌ విల్లాస్‌కు కేరాఫ్‌ వాసవీ అట్లాంటిస్‌. అడుగడుగునా ఆధునిక సౌకర్యాలు.. విలాసాలు కనిపిస్తుంటాయిందులో. అమోనిటీస్‌ విషయంలో తమ కస్టమర్లను ఎప్పుడూ డిజాప్పాయింట్‌ చేయని వాసవీ గ్రూప్‌- అట్లాంటిస్‌లోనూ మారుతోన్న లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా అత్యంత ఆధునిక ఎమోనిటీస్‌తో ఇందులో ఫ్లాట్స్‌ నిర్మాణాన్ని చేపట్టింది.

నార్సింగి దగ్గర వాసవీ అట్లాంటిస్ ఆకాశ‌హ‌ర్మ్యం
12.24 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం
8 బ్లాక్స్‌.. ఒక్కో టవర్‌లో 45 ఫ్లోర్లు..
మొత్తం 2,199 యూనిట్స్‌.. 85 స్కై విల్లాస్‌

మనం మెచ్చిన.. మనసుకు నచ్చిన అపార్ట్‌మెంట్స్‌కు రియల్ పిక్చరే వాసవీ అట్లాంటిస్‌. ఆకాశాన్ని అందుకుంటున్నట్టు.. మబ్బుల్లోకి దూసుకెళుతున్నాయేమో అన్నంత ఎత్తులో ఉంటాయి ఇందులోని హై రేజ్ అపార్ట్‌మెంట్స్‌. 70 శాతం ఓపెన్‌ స్పేస్‌. అద్భుతమైన ఇంటీరియర్స్‌.. ఆశ్చర్యపర్చే ఆర్కిటెక్చర్‌. విలాసం- సౌకర్యం ఇలా ఒకదానితో ఒకటి కలగలసి చూడగానే కళ్లు మిరుమిట్లుగొల్పే విజువల్‌ వండర్‌ వాసవీ అట్లాంటిస్‌. నార్సింగి దగ్గర కన్‌స్ట్రక్ట్‌ చేస్తోన్న ఈ గేటెడ్‌ కమ్యూనిటీ 12.24 ఎకరాల్లో ఉంది. 8 బ్లాక్స్‌ ఉన్న అట్లాంటిస్‌లో ఒక్కో టవర్‌లో 45 ఫ్లోర్లు ఉండగా.. మొత్తం 2 వేల 199 యూనిట్స్‌ నిర్మిస్తున్నారు.

ఇందులో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే, ఫోర్‌ బీహెచ్‌కే.. ఇలా ఎవరి బడ్జెట్‌కు తగ్గట్టు వారు తమకు కావాల్సిన ఫ్లాట్స్‌ను సెలక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే రెండు క్లబ్‌ హౌస్‌లు, వాకర్స్‌-జాగర్స్‌ ట్రాక్‌, బాంకెట్ హాల్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్టు, క్రికెట్‌ నెట్‌, సూపర్‌ మార్కెట్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఇండోర్‌ గేమ్స్‌, స్పా అండ్ సెలూన్‌, యోగా అండ్ మెడిటేషన్‌ రూమ్స్‌, బిజినెస్‌ సెంటర్‌ సహా అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయ్‌. వీటితో పాటు 85 స్కై విల్లాస్‌ను సైతం కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారిక్కడ. ఇప్పటికే అట్లాంటిస్‌ కంప్లీట్‌ కావొస్తుండటంతో వీలైనంత త్వరలో బయ్యర్లకు ఫ్లాట్స్‌ హ్యాండోవర్‌ చేయనున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles