poulomi avante poulomi avante

‘స్కోవా’ చక్కటి సహకారం..

కరోనా కల్లోల సమయంలో రక్త నిల్వలను పెంచడానికి ట్రెడా చక్కటి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భాగంగా.. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) రక్తదాన శిబిరాల్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. గత ఆదివారం నానక్ రాంగూడ చౌరస్తాలోని ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన కార్యక్రమంలో నివాసితులెంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ క్రమంలో భాగంగా, రేపు హైదరాబాద్లోని మియాపూర్ లో గల ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉంటుందని ట్రెడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మేకా విజయ్ సాయి తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అసోసియేషన్ (స్కోవా) చక్కటి సహాయ సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని గేటెడ్ కమ్యూనిటీలన్నీ ఇలాంటి తోడ్పాటును అందిస్తే.. రక్త నిల్వల్ని పెంచుకోవడం కష్టమేం కాదన్నారు.

తమ సంఘ సభ్యుల పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని తెలిపారు. రానున్న మంగళవారం గౌడవెల్లిలోని సాకేత్ భూసత్వ ప్రాజెక్టులో క్యాంపు ప్లాన్ చేశామన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles