కొంపల్లి గుండ్లపోచంపల్లిలో మరో అద్భుతమైన ప్రాజెక్టు లాంచ్ అయింది. ఎకరం స్థలంలో ఈ11 ఎవాల్వ్ హోమ్స్ పేరుతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో డబుల్ సెల్లార్, గ్రౌండ్ ప్లస్ 8 అంతస్తులు ఉంటాయి. 2 బీహెచ్ కే, 2.5 బీహెచ్ కే, 3 బీహెచ్ కేల్లో 1485 చదరపు అడుగుల నుంచి 2232 చదరపు అడుగుల మధ్యలో మొత్తం 86 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. టెర్రస్ పైన స్కై గార్డెన్ తోపాటు ఓపెన్ ఎయిర్ జిమ్, బార్బీకో, సిట్టింగ్ వ్యూ లాంజ్, మినీ థియేటర్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇక గ్రౌండ్ లో రిసెప్షన్, 85 మందికి సరిపడా ఈవెంట్ స్పేస్, గ్రాసరీ స్టోర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అంతస్తుకూ 10 ఫ్లాట్లు ఉంటాయి.
ఫ్లాట్ లో మాడ్యులర్ కిచెన్ సహా ఇంటీరియర్ కూడా పూర్తి చేసి ఇస్తారు. లోపల, కారిడార్, బాల్కనీల్లో ఫాల్స్ సీలింగ్, లైట్లు, వార్డ్ రోబ్స్, పార్టిషియన్లు అన్నీ బిల్డరే చేసి ఇస్తారు. అలాగే డోర్లన్నీ 8 అడుగులవే ఉపయోగించనున్నారు. 2.5 బై 5 ఫీట్ టైల్స్ వినియోగించనున్నారు. బాల్కనీలో భద్రత కోసం గ్రిల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం 2.6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిచేసి అప్పగించడానికి మార్చి 2024ను గడువుగా నిర్దేశించుకున్నప్పటికీ, అంతకంటే ముందుగానే 2023 అక్టోబర్ లోగా అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.