Categories: TOP STORIES

డీఎల్‌ఎఫ్‌ సైబర్‌ సిటీలోకి స్మార్ట్‌ వర్క్స్

  • 2.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు తీసుకున్న కంపెనీ

స్మార్ట్‌ వర్క్స్ కో వర్కింగ్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లో తన పోర్టిఫోలియో విస్తరిస్తోంది. భాగ్యనగరంలో ఇప్పటికే మూడు చోట్ల స్పేస్‌ కలిగి ఉన్న ఈ కంపెనీ.. తాజాగా గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ సైబర్‌ సిటీలోకి అడుగుపెట్టింది. అక్కడ 2.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లో మొత్తం తన ఆక్యుపెన్సీ 10 లక్షల చదరపు అడుగులకు చేరినట్టు ప్రకటించింది. ఇప్పటివరకు రాయదుర్గంలోని పూర్వ సమ్మిట్‌, కొండాపూర్‌లోని గెలాక్సీ, మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌ బిల్డింగ్‌ 3ఎ, 3బీలలో స్మార్ట్‌ వర్క్స్ పనిచేస్తోంది.

గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఉన్న తాజా స్పేస్‌.. ఇటు హైటెక్‌ సిటీకి సమీపంలో ఉండటంతోపాటు ఔటర్‌ రింగు రోడ్డుతో మంచి కనెక్టివిటీ కలిగి ఉందని పేర్కొంది. కంపెనీల నుంచి స్థిరమైన డిమాండ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో విస్తరిస్తున్నామని.. పూర్తిగా ఆధునిక సౌకర్యాలతో కూడిన పని వాతావరణాన్ని ప్రతిబింబించేలా తమ ఆఫీస్‌ స్పేస్‌ ఉంటుందని స్మార్ట్‌వర్క్స్ వ్యవస్థాపకుడు నీతిష్ సర్దా పేర్కొన్నారు.

This website uses cookies.