Categories: TOP STORIES

ఈఎంఐ మేం కడతాం.. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ తాజా ఆఫర్

హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నది మీ చిరకాల కోరిక. కానీ, కరోనా వల్ల మధ్యలో ఉద్యోగం పోతుందేమోనని మీ భయం. మళ్లీ కొత్త సంస్థలో జాబ్ రావడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు. మరి, అప్పటివరకూ నెలసరి ఈఎంఐ కట్టడమెలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం మీరు చింతించాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వాస్తవిక సమస్యల్ని గుర్తించిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ( SMR Holdings ) ఈఎంఐ ప్రొటెక్షన్ షీల్డ్ ఆఫర్ ని అందజేస్తోంది.

ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు.. మీ కలల ఇంట్లోకి అడుగుపెట్టేంత వరకూ నయా పైసా కట్టక్కర్లేదు. ఈ స్కీమును ప్రస్తుతం ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలోని హామిల్టన్, లోగాన్ టవర్లలో ఫ్లాట్లను కొనేవారికి వర్తింపజేస్తోంది. అంతేకాదు, బండ్లగూడలోని ఎస్ఎంఆర్ వినయ్ బోల్డర్ వుడ్స్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనేవారికీ పథకాన్ని అందజేస్తోంది.

18 నెలల్లో పూర్తి..

ఈఎంఐ ఆఫర్ అందజేస్తున్నారు కాబట్టి.. ప్రాజెక్టు పూర్తవ్వడానికి నాలుగైదేళ్లు పడుతుందని పొరపాటు పడేరు. కొండాపూర్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలోని హామిల్టన్ టవర్ దాదాపు అరవై శాతం పూర్తయ్యింది. పద్దెనిమిది నెలల్లో ఈ టవర్ పూర్తవుతుంది. లోగాన్ టవర్ మరో 21 నెలల్లో పూర్తవుతుంది. అప్పా జంక్షన్ చేరువలోని బోల్డర్ వుడ్స్ మరో 18 నెలల్లో పూర్తి కానుంది.

హైదరాబాద్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి ఇంతకంటే మంచి అవకాశం లేదని చెప్పొచ్చు. కేవలం ఈ నెలలో కొనేవారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఈడీ పృథ్వీరాజ్ రెడ్డి తెలిపారు. జులై 1 నుంచి ప్రకటించిన ఈ ఆఫర్ కు కొనుగోలుదారుల నుంచి చక్కటి రెస్పాన్స్ వస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పథకాన్ని అందజేయడం పట్ల బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

This website uses cookies.