poulomi avante poulomi avante

నివాస స్థ‌లాల‌కు సౌత్‌జోన్ సూప‌ర్‌

సౌత్ జోన్ లో కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్…

అందుబాటులో వున్న ధరలు
ఈ జోన్ కి ప్లస్ పాయింట్…

ట్రాన్స్‌పోర్టేషన్‌- కనెక్టవిటీ దక్షిణ
ప్రాంతానికి అనుకూలం…

సౌత్ జోన్ కి సమీపంలోనే ఇన్నర్‌ రింగ్ రోడ్‌…

నివాస స్థలాలకు సెకండ్ అడ్రస్‌గా మహేశ్వరం

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే హైద్రాబాద్‌ రియాల్టీ సెక్టార్‌ జోరు మాత్రం తగ్గట్లేదు. ఆ మాటకొస్తే ఇండియాలో నిర్మాణ రంగం బాగా యాక్టివ్‌గా ఉన్న సిటీ కూడా హైద్రాబాదే. అందుకే ఇక్కడ ప్లాట్‌.. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు.. విల్లా.. ఇలా ప్రాపర్టీ ఏదైనా సరే డిమాండ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అమ్మకానికి ఉంది అని తెలిస్తే చాలు ఎగబడి కొంటున్నారు బయ్యర్లు. పైగా నగరం నలుమూలాల అభివృద్ధి విస్తరిస్తుండటం.. ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా ఈజీ ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటి ప్రాంతాల దూరాన్ని దగ్గర చేసేశాయ్‌. ఈ రీజన్‌తోనే జోన్లు- ప్రాంతాలతో సంబంధం లేకుండా రియాల్టీ సెక్టార్‌ ఉరుకులు పెడుతోంది. ఇక డెవలప్‌మెంట్లో కానీ.. ప్రైస్‌ పరంగా వెస్ట్‌జోన్‌ డామినేట్‌ చేస్తుంటే.. అభివృద్ధికి నెక్ట్స్‌ స్టాప్‌గా మారడం.. కావాల్సినంత ల్యాండ్‌ బ్యాంక్‌.. ధరలు సైతం అందుబాటులో ఉండటం సౌత్‌జోన్‌కి అడ్వాంటేజ్‌. అందుకే ఇప్పుడు దక్షిణాది వైపు మొగ్గు చూపుతున్నారు బయ్యర్లు. మరి సౌత్‌ జోన్లో ఏ ఏ ప్రాంతాల్లో ఓపెన్‌, రెసిడెన్షియల్‌, ప్రీమియం ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

ఒక్కప్పుడు భాగ్యనగరం అంటే నిజాంల సంస్కృతి- సంప్రదాయాలు. చార్మినార్‌ లాంటి చారిత్రక కట్టడాలు. ఇప్పుడు హైద్రాబాద్‌ అంటే అభివృద్ధికి చిరునామా. ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ లాంటి మోడ్రన్‌ కన్‌స్ట్రక్షన్స్‌. ఐటీ హబ్‌గా డెవలప్‌ అవడం.. ఎంఎన్‌సీ కంపెనీలు హైద్రాబాద్‌ను తమ అడ్డాగా మార్చుకోవడం.. హైటెక్ సిటీ అనే పాపులార్టీ. ఇవన్నీ హైద్రాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ను హాట్‌ ఫేవరేట్‌గా ఉంచుతున్నాయ్‌. డెవలప్‌మెంట్‌కి కేరాఫ్‌గా ఉంది కాబట్టే ఇక్కడ రెసిడెన్షియల్‌.. ఆఫీస్‌ స్పేస్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌ లాంటి ప్రాంతాలు ఫాస్ట్ డెవలప్‌మెంట్‌తో ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎట్రాక్ట్‌ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయ్‌. అదే సమయంలో హైద్రాబాద్‌ అంటే ఒక్క వెస్ట్‌జోనే కాదు. లేదా ఐటీ కారిడార్ మాత్రమే కాదన్నట్టు వేగంగా వృద్ధి చెందుతున్నాయి మిగిలిన ఏరియాలు. సిటీ సెంటర్లోనే కాకుండా బోనగిరి, తుక్కుగూడ, మహేశ్వరం, శంషాబాద్‌ లాంటి ప్రాంతాలు సహా ప్రతి మూలకు హైద్రాబాద్ విస్తరిస్తోందిప్పుడు.

మహేశ్వరం, తుక్కుగూడ, శామీర్‌పేట ఇవన్నీ గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్ ఏరియాలకు అనుబంధ ప్రాంతాలుగా మారుతున్నాయిప్పుడు. ఐటీ.. ఎంఎన్‌సీ కంపెనీల ఉద్యోగులంతా తాము నివాసం ఉండటానికీ ప్రాంతాలు అనువైనవిగా భావిస్తుండటంతో ఈ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అన్నింటి కంటే ముఖ్యమైనది.. మిగిలిన జోన్లతో పొల్చితే కలిసొచ్చే విషయం ఇక్కడ ధరలు తక్కువగా ఉండటం. అందుకే సౌత్‌జోన్‌ రియాల్టీ మార్కెట్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. లగ్జరీ విల్లాలు.. గేటెడ్ కమ్యూనిటీ.. కమర్షియల్ స్పేస్‌లు.. అదే సమయంలో బడ్జెట్ రెసిడెన్షియల్‌ ప్లాట్స్‌ అండ్‌ ఫ్లాట్స్ ఏది కావాలన్నా దక్షిణాది వైపే చూస్తున్నారు బయ్యర్లంతా.

హైద్రాబాద్‌ నగరం విస్తరిస్తోన్న కొద్దీ దక్షిణాది ప్రాంతాలన్నీ రియల్‌ ఎస్టేట్‌కి హాట్‌స్పాట్స్‌గా మారుతున్నాయ్‌. తుక్కుగూడ, మహేశ్వరం, శామీర్‌పేట్‌, రాయ్‌గిరి, షాద్‌నగర్‌, తుర్కపల్లిలు ఈ రేస్‌లో ముందు వరసలో ఉన్నాయ్‌. ఒకప్పుడు నగరానికి దూరంగా విసిరేసినట్టుండే ఈ ప్రాంతాలకు ప్రయాణమంటే వ్యయ ప్రయాసలతో కూడిన విషయం. కనెక్టివిటీ పెరగడంతో టోటల్‌ సినారియో మారిపోయిందిప్పుడు. ఇటు వైపు జర్నీ అంటే అసలు విషయమే కాదన్నట్టు ఛేంజ్‌ అయిపోయింది. అందుకే నగర విస్తరణలో ఈ ప్రాంతాలే ఫస్ట్‌ రో లో కనిపిస్తున్నాయ్‌. ల్యాండ్స్‌కి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

శంషాబాద్‌ అంటే ముందు గుర్తొచ్చేది రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టే. అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉండటంతో ఇటు నివాసం పరంగానూ.. అటు వాణిజ్య కేంద్రంగానూ శంషాబాద్‌ డెవలప్‌మెంట్‌ కంటిన్యూస్ ప్రాసెస్‌గా ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఆనుకోని ఉండంటంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ సులభంగా మారింది శంషాబాద్‌ నుంచి. అందుకే రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి శంషాబాద్‌ను మించిన బెస్ట్ ఛాయిస్‌ దొరకదేమో. బయ్యర్ల నుంచి విపరీతంగా డిమాండ్ పెరగడంతో శంషాబాద్‌లో లగ్జరీ విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కమర్షియల్ స్పేస్‌లు పుట్టుకొస్తున్నాయ్‌. ఇక హైద్రాబాద్‌ సౌత్‌ ఏరియాలో వేగంగా వృద్ధి చెందుతోన్న మరో ప్రాంతం తుక్కుగూడ.

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఓఆర్ఆర్‌ కి దగ్గరగా ఉండటంతో తుక్కుగూడ రెసిడెన్షియల్‌- వాణిజ్య కార్యకలాపాలకు సెంటర్‌గా ఉంది. విలాసవంతమైన విల్లాలు.. హై ఎండ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ. రద్దీగా ఉండే నగర జీవనానికి దూరంగా విశాలమైన గృహాల కోసం సెర్చ్ చేస్తున్న కొనుగోలుదారులను ఈ ప్రాంతం విపరీతంగా ఆకర్షిస్తోంది. 300 నుంచి 1600 చదరపు గజాల మధ్య ప్రీమియం ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉండగా.. స్క్వేర్‌ఫీట్‌ ధర 4,600 నుంచి 5,800 వరకు ఉంది. ప్రైస్‌ ఆన్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ధరలు ఇంకాస్త తగ్గే ఛాన్సెస్ కొట్టిపారేయలేం.

ట్రాన్స్‌పోర్టేషన్‌- కనెక్టవిటీ పరంగా దక్షిణ ప్రాంతానికి చాలా సానుకూలాంశాలున్నాయ్‌. శ్రీశైలం హైవే, బెంగళూర్‌ నేషనల్ హైవే, దగ్గర్లోనే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, ఔటర్ రింగ్‌ రోడ్‌ మీదుగా ఐటీ కారిడార్‌కు సులువుగా చేరుకునే వీలుండటం, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేతో నగరంలోకి ఫాస్ట్‌గా రీచ్‌ అయ్యే అవకాశం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు వీలుగా శివరాంపల్లి.. బుద్వేల్ ఎంఎంటీఎస్‌ స్టేషన్లు.. సమీపంలోనే ఇన్నర్‌ రింగ్ రోడ్‌ ఉండటం. ఇవన్నీ సౌత్‌జోన్లో రియాల్టీ ఊపందుకోడానికి తమ వంతు సాయం చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సౌత్‌జోన్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన ప్రాంతం మహేశ్వరం. గతంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండేది మహేశ్వరం. ఇప్పుడు రియాల్టీ ప్రభావంతో నివాస స్థలాలకు సెకండ్ అడ్రస్‌గా మారిపోయింది. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం.. సమీపంలోనే విమానాశ్రయం.. ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండటంతో రియల్‌ ఎస్టేట్ డెవలపర్లతో పాటు బయ్యర్లని కూడా మహేశ్వరం మండలం ఈజీగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. నగరానికి యాక్సెస్‌ సులభంగా ఉండటంతో ప్రశాంతమైన నివాస స్థలాల కోసం చూస్తోన్న వారంతా మహేశ్వరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మోస్ట్ వాంటెడ్‌ రెసిడెన్షియల్‌ ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది ఈ ప్రాంతం.

ఇక్కడ 200 నుంచి 1300 చదరపు గజాలు.. 174 నుంచి 664 చదరపు గజాల మధ్య రెసిడెన్షియల్‌ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయ్‌. ఇక్కడ స్క్వేర్‌ఫీట్‌ 1300 రూపాయల 2 వేల 300 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే శ్రీశైలం హైవేకి సమీపంలోని కడ్తాల్‌లో 154 నుంచి 587 స్క్వేర్‌యార్డ్స్‌ విస్తీర్ణం గల ప్లాట్లు సేల్‌కి రెడీగా ఉన్నాయ్‌. చదరపు గజం ధర 11,500 రూపాయలుగా ఉంది. శ్రీశైలం హైవే సమీపంలోని కందుకూరులో 231 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్‌ ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక్కడ స్క్వేర్‌ఫీట్‌ వెయ్యి రూపాయలుగా ఉంది. ఇక మీర్‌ఖాన్‌పేటలో 200 నుంచి 400 చదరపు గజాల రెసిడెన్షియల్‌ ప్లాట్స్ ఉండగా.. ఇక్కడ చదరపు అడుగు 3,400 రూపాయలు పలుకుతోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles