ప్రత్యేక కేటగిరీ కింద భవన అనుమతి కోసం దరఖాస్తు చేసినవారు ఫైర్ ఎన్వోసీ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ మేరకు నిబంధనలను సడలించామని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పేర్కొంది. గతంలో భవన అనుమతులు మంజూరు చేయాలంటే ఫైర్ ఎన్వోసీ తీసుకోవడం తప్పనిసరిగా ఉండేదని, అయితే, స్పెషల్ కేటగిరీ కిందకు వచ్చే రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు ఫైర్ ఎన్వోసీ అవసరం లేని విధంగా నిబంధనల్లో వెసులుబాటు కల్పించామని వివరించింది. ‘కొత్త నిబంధనల ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్, మూడు అదనపు అంతస్తులు, స్టిల్ట్ పార్కింగ్ తో కూడిన 17.5 మీటర్ల లోపు ఎత్తున్న భవనాలకు ఎన్వోసీ అవసరం లేదు’ అని పేర్కొంది. అయితే, స్టిల్ట్ లేని భవనాలకు ఈ కొత్త నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.