చందానగర్ పీజేఆర్ లేఅవుట్లో శర్వానీ వెంచర్స్ అండ్ ఎవెన్యూస్ ఓ బడా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అపర్ణా హిల్ పార్కు రోడ్డులోని కేఎస్ఆర్ లేఅవుట్లో.. దాదాపు ఎనిమిది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టుకు శ్రీ హేమా దుర్గా ప్యారడైజ్ అని నామకరణం చేసింది. సుమారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఆరు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో వచ్చేవి సమారు 1128 ఫ్లాట్లు. ఈ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ అనుమతి లభించింది. తెలంగాణ రెరా అథారిటీ అప్రూవల్ ఉంది.
రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లను నిర్మించే ఈ ప్రాజెక్టులో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. సుమారు పదిహేడు రకాల ఆధునిక సౌకర్యాల్ని పొందుపర్చింది. టెర్రస్ మీద రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తోంది. టెన్నిస్ కోర్టు, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికల్ని రచించింది. ఏటీఎం, బ్యాంకెట్ హాల్, ప్రీమియం మినీ థియేటర్, ఫిట్ నెస్ సెంటర్, బిజినెస్ సెంటర్, బౌలింగ్ యాలీ, ఎయిర్ హాకీ, ట్రాంపోలీన్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తోంది. సాకర్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ గ్యాలరీ వంటివాటికి స్థానం కల్పించింది.
* ఈ ప్రాజెక్టులో ప్రత్యేకంగా పెంపుడు కుక్కల గురించి డాగ్ పార్కు ఏరియాను కేటాయిస్తున్నట్లు సంస్థ వెబ్ సైటులో చూస్తే తెలుస్తోంది. మూడంచెల సెక్యూరిటీ సిస్టమ్, ఔట్ డోర్ ఓపెన్ జిమ్, గ్యార్బేజ్ చూట్ వంటి వాటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతి టవరుకో గ్రాండ్ లాబీ, సీసీటీవీ కెమెరాల్ని పొందుపర్చింది. సివరేజీ ట్రీట్ మెంట్ ప్లాంటుకు స్థానం కల్పించింది. హైటెక్ సిటీకి ఇక్కడ్నుంచి దాదాపు 10.5 కిలోమీటర్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది.