Categories: TOP STORIES

బ్యాంకు వేలంలో.. ప్రాపర్టీ కొన్న సునీల్ శెట్టి

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆయన కుమారుడు అహన్ శెట్టి బ్యాంకు వేలంలో ఓ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. ముంబై బాంద్రా ప్రాంతంలో ఉన్న 1,200 చదరపు అడుగుల ప్రాపర్టీని రూ. 8.01 కోట్లకు కొన్నట్టు స్క్వేర్ యార్డ్స్ తెలిపింది. అక్టోబరు 2024లో రిజిస్ట్రేషన్ జరిగిందని, స్టాంప్ డ్యూటీ కింద రూ. 40.08 లక్షలు, రిజిస్ట్రేషన్ రుసుము కింద రూ.30వేలు చెల్లించారు.

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, కెఎల్ రాహుల్, అథియా శెట్టి వంటి పలువురు ప్రముఖులు ఇటీవల ముంబైలోని బాంద్రాలో పెట్టుబడులు పెట్టారని స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, వర్లీ, అంధేరి వాణిజ్య కేంద్రాలకు బాంద్రా సమీపంలో ఉన్నందున ఇక్కడ ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువ. అద్భుతమైన మౌలిక సదుపాయాలతోపాటు కీలక ప్రాంతాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా కనెక్టివిటీ, ప్రీమియం సౌకర్యాల కారణంగా హై-ప్రొఫైల్ హోమ్‌ బయ్యర్లలో ఈ ప్రాంతానికి డిమాండ్ అధికంగా ఉంటుందని స్క్వేర్ యార్డ్స్ తెలిపింది.

కాగా, ఈ వారం ప్రారంభంలో బాలీవుడ్ తండ్రీకొడుకుల ద్వయం అమితాబ్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని ములుండ్ ప్రాంతంలో ₹24.95 కోట్ల విలువైన 10 అపార్ట్ మెంట్లను కొనుగోలు చేసి వార్తల్లోకెక్కారు. పది అపార్ట్ మెంట్లలో ఎనిమిది ప్లాట్ల కార్పెట్ ఏరియా ఒక్కొక్కటి 1,049 చదరపు అడుగుల విస్తీర్ణం కాగా, రెండు యూనిట్లు 912 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 10 అపార్ట్ మెంట్లకు రూ.1.50 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 3 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.

This website uses cookies.