Categories: LATEST UPDATES

ఏపీలో19 వేల అక్రమ లేఔట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అనుమతులూ లేకుండా అభివృద్ధి చేసిన దాదాపు 19వేలకు పైగా అక్రమ లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లలను టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) నిలిపివేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ లేఔట్లను అక్రమ లేఔట్లుగా ప్రకటించి, వాటి లావాదేవీలను నిలిపివేసింది. మొత్తం దాదాపు లక్ష ఎకరాలకు పైగా భూమి ఈ లేఔట్లలో ఉన్నట్టు సమాచారం.

రెగ్యులేటరీ ఫీజు, నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసిన తర్వాతే వాటిలో రిజిస్ట్రేషన్లు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయా లేఔట్ల సమాచారాన్ని సర్వే నెంబర్లతో సహా పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు డీటీసీపీ పంపించింది. దీంతో ఇప్పటికే అందులో ప్లాట్లు కొనుగోలుచేసిన వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే, 2020 జనవరి 7వ తేదీ కంటే ముందు కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

This website uses cookies.