Categories: Celebrity Homes

నాది చాలా సాధారణమైన ఇల్లు

  • నటి తేజస్వి ప్రకాష్

ట్రెండింగ్ నటి తేజస్వి ప్రకాష్ ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామా? చూడటానికి చాలా సాధారణంగా కనిపించే ఆమె ఇంటి నిండా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన పలు డేకరేటెడ్ వస్తువులు కనిపిస్తాయి. వాటితో తన ఇంటిని అలంకరించుకున్నారు. తేజస్వి ఇంట్లోకి వెళుతుంటేనే సంప్రదాయం కట్టిపడేస్తుంది. రెండు వైపులా రంగురంగుల హ్యాంగింగ్ లతో అలంకరించి ఉన్న ఊదా రంగు ప్రవేశద్వారం స్వాగతం పలుకుతుంది. ఇంట్లోకి వెళ్లి చూస్తే సాధారణ ఇంటీరియర్లు కనువిందు చేస్తాయి. ముంబై ఇంట్లో తాను 25 ఏళ్లుగా నివసిస్తున్నట్టు తేజస్వి వెల్లడించారు. ఆమె డ్రాయింగ్ రూమ్ చాలా బాగుంటుంది. పెద్ద కిటికీ నుంచి వచ్చే వెలుతురు ఆ గది మొత్తం పరుచుకుంటుంది. ఓ వైపు ఆకుపచ్చ సోఫా, దాని పక్కనే ఒట్టోమన్ తో కూడిన పూల వింగ్ కుర్చీ, పెద్ద ఎల్ సీడీ టీవీ, కొన్ని సాధారణ అలంకరణ వస్తువులతో ఆ గది కనువిందు చేస్తుంది. తన ఇల్లు సాధారణ ప్లానింగ్ తో ఎలా ఇలా రూపుదిద్దుకుందో తేజస్వి వివరించారు.

‘నేను గత 25 ఏళ్లుగా నివసిస్తున్న ఇల్లు ఇది. ఈ ఇంటిని ఇలా రూపొందించడం కోసం పెద్దగా ఏమీ ఆలోచించలేదు. ఇది చాలా సాధారణమైన ఇల్లు. దీనికి నాలుగు గోడలు ఉన్నాయి అంతే’ అని వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె తన నటనా నైపుణ్యంతోనే కాకుండా వైవిధ్యమైన పాత్రల ఎంపిక ద్వారా తరచుగా పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. ఆమె తన రూపాన్ని సురక్షితంగా ఉంచుకోకుండా దానిపై ప్రయోగాలు చేస్తుంటారు. ఆమె ప్రతి కొత్త లుక్ తో యువతను ఉర్రూతలూగిస్తారు. ఇక ఆమె స్టైల్ అదుర్స్ అనిపిస్తుంది. తేజస్వి మహారాష్ట్ర కుటుంబానికి చెందిన వ్యక్తి. అందువల్లే ఆమె ఇల్లు ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన పలు చమత్కారమైన వస్తువులతో అలకంరించి ఉంటుంది. ఆమె ఇల్లు చాలా సంప్రదాయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆమె ఇంట్లో కలియ తిరుగుతుంటే శునకపు ఆకారపు టూత్ పిక్ స్టాండ్, ప్లాంట్లు, క్యాండిల్స్, స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చిన చెక్క గడియారం, మాస్కులు, మెటల్ లైట్లు వంటి ఎన్నో డెకర వస్తువులు కనిపిస్తాయి. ప్రకృతితో మమేకమై ఉండే పొడవైన బాల్కనీ నుంచి ఆమె తరచుగా ఎన్నో చిత్రాలను క్లిక్ చేస్తారు. బాల్కనీ నుంచి చూస్తే పచ్చటి మైదానం అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ పిల్లలు గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇక తేజస్వి దంపతులకు పామ్ జుమేరా బీచ్ రెసిడెన్స్ ఓ అధునాతన 1 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కు యజమానులు కూడా. ఇండోర్ పూల్ తో వచ్చిన ఈ ఖరీదైన నివాసం విలువ దాదాపు రూ.2 కోట్లు.

This website uses cookies.