Categories: TOP STORIES

బ్లాక్ చైన్ ప‌రిజ్ఞానంతో భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు

సాధారణంగా భవనాల నిర్మాణం, లే ఔట్ల అనుమతులకు డ్రాయింగ్‌, స్క్రూటిని ప్రాసెస్‌ ఆలస్యమవుతుంటోంది. పర్మిషన్స్‌ వచ్చేసరికి రోజుల నుంచి నెలల సమయం గడిచిపోతుంటుంది. ఈ విధానానికి స్వస్తి చెబుతూ బిల్డ్‌ నౌ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. బిల్డ్‌ నౌ ద్వారా భవనాల నిర్మాణం, లే ఔట్ల అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది.

బిల్డ్‌ నౌ టెక్నాలజీ ద్వారా డ్రాయింగ్ అండ్‌ స్క్రూటిని ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తి కానుంది. అంతేకాదు త్రీడీ టెక్నాలజీ ద్వారా ప్రజలు తమ భవన నిర్మాణ ప్రక్రియను ముందే అగ్మెంటెడ్ విజువలైజేషన్ ద్వారా చూడొచ్చు.
మోడ్రన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగేసింది. బిల్డింగ్స్‌, లే ఔట్ల పర్మిషన్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. బిల్డ్ నౌ పేరుతో నూతన ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ సర్కార్‌. బిల్డ్‌ నౌతో అనుమతులు, డ్రాయింగ్ స్క్రూట్నీ ప్రాసెసింగ్ సమయం వారాల నుంచి నిమిషాల్లోకి తగ్గనుంది.
బిల్డ్ నౌ భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థ అని.. ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవన రూల్స్‌ అండ్ పర్మిషన్స్‌కు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చవచ్చని.. ఇది ఒక బెంచ్‌ మార్క్‌గా నిలిచిపోవడం ఖాయమన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి డి. శ్రీధర్‌ బాబు.
ఇన్నాళ్లూ టీజీబీపాస్‌ ద్వారా ఈ అనుమతుల ప్రక్రియ నడిచేది. ఇందులో సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు లావాదేవీలు, ఆమోదాలు ప్రజలకు పూర్తిగా కనిపించవు. అదే బిల్డ్‌ నౌలో పబ్లిక్ బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ కారణంగా నమ్మకం, జవాబుదారీతనాన్ని పెరుగుతోంది. ఇక టీజీబీపాస్‌లో దరఖాస్తు ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉందనే కంప్లైంట్స్‌ ఉన్నాయ్‌. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడటంతో పాటు పొరపాట్లకు తావుంది. బిల్డ్‌ నౌలో AI బేస్డ్‌ వర్చువల్‌ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్‌ ఫీచర్‌ ఉంది.
దీనిద్వారా అప్లికేషన్‌ ప్రాసెస్‌లోనే వినియోగదారుల సందేహాలు, సమస్యలు నివృత్తి చేయొచ్చు. టీజీబీపాస్‌లో నియమ నిబంధనలను సులభంగా యాక్సెస్‌ చేసే అవకాశముండేది కాదు. ఏదైనా సమాచారం కావాలంటే పెద్ద డాక్యుమెంట్లను రీసెర్చ్‌ చేయడమో.. లేదా ప్రభుత్వం స్పందించే దాకా ఎదురుచూడటమో చేయాలి. బిల్డ్‌ నౌలో AI చాట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇందులో వినియోగదారులకు కావాల్సిన భవన నియమాలు, నిబంధనలపై తక్షణ సమాచారం పొందొచ్చు. మాన్యువల్ డేటా ఎనాలసిస్‌ కారణంగా టీజీబీపాస్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమయ్యేది. బిల్డ్ నౌలో రియల్ టైమ్‌ విశ్లేషణను డేటా కో-పైలట్ తక్షణమే అందిస్తుండటం వల్ల హ్యుమన్ ఎర్రర్స్ ఛాన్స్‌ లేదు.

This website uses cookies.