Categories: TOP STORIES

రూ.45 ల‌క్ష‌ల‌కే ఫ్లాట్లు కావాలా? ఈ ఏరియాలో చూడండొక‌సారి!

ఇల్లు, ప్లాట్లు కొనేముందు ఎవరైనా మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యాసంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో ఇలా అన్ని విధాలుగా అభివృద్ది చెంది.. హైదరాబాద్‌ మహా నగరానికి సమీపంలో ఉన్నషామీర్ పేట్ వైపు చూస్తున్నారు అంతా. అవును ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న షామీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరందుకోవడం, అందరికి అందుబాటు ధరలో గృహాలు లభిస్తుండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి జోరుమీదుంది.

షామీర్ పేట్ ప్రాంతానికున్న ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. షామీర్ పేట్ చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. అందరికి అందుబాటు ధరలో అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు లభిస్తుండటంతో అంతా షామీర్ పేట్ వైపు చూస్తున్నారు. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా షామీర్ పేట్ ఆకర్షిస్తోంది.

షామీర్ పేట్ దగ్గర ప్రతిష్టాత్మకమైన నల్సార్ లా యూనివర్సిటీతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కూడిన జీనోమ్ వ్యాలీ, ఇండస్ట్రియల్ ఏరియా ఉండటంతో ఇక్కడ ఉపాది అవకాశాలు ఏక్కవగా ఉన్నాయి. అంతే కాదు ప్రముఖ విద్యా సంస్థలన్నీ షామీర్ పేట్ పరిసర ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. షామీర్ పేట్ రాజీవ్‌ రహదారి, అవుటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉంది. మేడ్చల్‌ జిల్లా కొత్త కలెక్టరేట్‌ సైతం షామీర్ పేట్ కు దగ్గర్లో ఉండటం విశేషం. శామీర్‌పేట సహా చుట్టుపక్కల ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారడంతో ఇక్కడ ఇంటి కొనుగోలుకు అంతా మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటికీ అందుబాటులో ఉన్న ధరలతో శామీర్‌పేట వైపు ఇంటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కండ్లకోయ ఐటీ పార్క్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ బయట ఉండే శామీర్‌పేట, ఓఆర్‌ఆర్‌ లోపల ఉండే తూంకుంట ప్రాంతానికి మధ్య అనేక నివాస ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రతిష్టాత్మక జీనోమ్‌ వ్యాలీ సమీపంలో ఇప్పుడిప్పుడే నివాసాలు ఏర్పాటవుతున్నాయి. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సహా ఇక్కడ ఏర్పాటైన పలు ఇతర ఫార్మా సంస్థల్లో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.

వీరు సమీపంలో అపార్ట్ మెంట్లలోని ఫ్లాట్లు కొనేందుకు ఆసక్తిచూపుతున్నారు. షామీర్ పేట్ వరకు త్వరలోనే ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరగనున్నాయి. షామీర్ పేట్ నుంచి కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో నగరానికి చేరుకునే అవకాశం ఉంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి షామీర్ పేట్ నుంచి 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ జిల్లా, పలు ఐటీ కంపెనీలకు ఇక్కడ నుంచి ౩0 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు.

షామీర్ పేట్ లో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు లభిస్తున్నాయి. షామీర్ పేట్ దగ్గర శ్రీనాధ్ కన్ స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ లో 945 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 45 లక్షల్లో లభిస్తోంది. ఇందు హోమ్స్ నిర్మిస్తున్న ఇందు క్రాంతి ప్రాజెక్టులో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 52 లక్షల్లో లభిస్తోంది.

విల్లాలకు వచ్చే సరికి 1.2 కోట్ల నుంచి మొదలు 8 కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టును బట్టి ధరలున్నాయి. షామీర్ పేట్ దగ్గర ప్రజయ్ హోమ్స్ నిర్మిస్తున్న ట్రీ టాప్స్ ప్రాజెక్టులో 4 బీహెచ్‌కే విల్లా 2.15 కోట్ల రూపాయల్లో లభిస్తోంది. షామీర్ పేట్ లో డీటీసీపీ లేఅవుట్ లో ఇంటి స్థలం చదరపు గజం ప్రాంతాన్ని బట్టి 16 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు చెబుతున్నారు.

This website uses cookies.