కుక్కల బెడద తగ్గడానికి టాప్ టెన్ ప్రణాళికలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు, బ్లూక్రాస్ సభ్యులతో అపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ కుక్కల బెడద నివారణకు, కుక్క కాటు ఘటనల నియంత్రణకు కార్యచరణ రూపొందిస్తుంది.
వీధి కుక్కల ప్రవర్తనపై నివాసి సంక్షేమ సంఘాలు, మురికివాడల స్థాయి సమాఖ్యలు మరియు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (IEC) ప్రచారాన్ని చేపడతారు.
రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో జంతు సంరక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తారు.
వీధి కుక్కల బెడదపై అవగాహన కల్పించేందుకు వచ్చే వారంలోగా జీహెచ్‌ఎంసీలోని ప్రతి వార్డులో శానిటరీ జవాన్లు, ఫీల్డ్ శానిటరీ అసిస్టెంట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలు, మదర్స్ గ్రూపులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
నగరంలో వీధికుక్కల కోసం ప్రయోగాత్మకంగా రెండు షెల్టర్ హోంలను జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తారు.
నగరంలో వీధి కుక్కల సర్వేతోపాటు స్టెరిలైజేషన్ డ్రైవ్, వీధి కుక్కలన్నింటికీ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్‌ను జీహెచ్‌ఎంసీ చేపడుతుంది.
పెంపుడు కుక్కల నమోదును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
వీధి కుక్కలు గుమిగూడకుండా ఉండేలా ఎక్కడికక్కడ చెత్తను తొలగిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు మొదలైన వాటి ద్వారా ఆహార వ్యర్థాలను సక్రమంగా పారవేసేలా చూస్తారు
నిర్మాణాలు జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా క్రెష్ ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ చర్యలను తీసుకుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను పని మీద వదిలి వెళ్ళినప్పుడు, నిర్మాణ కార్మికుల పిల్లలు సైట్ల వద్ద కుక్కల దాడులకు గురవుతున్నారు
కుక్కల పెంపకందారులతో పాటు వీధి కుక్కలకు ఆహారం తినిపించేవారికీ అవగాహన కల్పిస్తారు.