నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లపై తెలంగాణ రెరా కొరడా ఝుళిపించింది. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ మండలం కౌకూరులో మెహతా అండ్ మోడీ రియల్టీ చేపట్టిన గ్రీన్ వుడ్ హైట్స్ ప్రాజెక్టులో అనధికార నిర్మాణాలు చేసినందుకు ఆ సంస్థకు రూ.9.8 లక్షల జరిమానా విధించింది. 2023 ఫిబ్రవరి 25న తనకు ఫ్లాట్ అప్పగించిన తర్వాత తన ప్రైవేట్ బాల్కనీలో నుంచి తనకు తెలియకుండా టాయిలెట్ డ్రైనేజీ పైప్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించినట్టు పరంజిత్ దాస్ అనే వ్యక్తి రెరాకు ఫిర్యాదు చేశారు.
తన ఫ్లాట్ పై ఏడో అంతస్తులో టాయ్ లెట్ నిర్మించారని, ఆ డ్రైనేజీ పైప్ లైన్ తన బాల్కనీ నుంచి వెళ్లిందని పేర్కొన్నారు. దీనిపై మెహతా అండ్ మోడీ రియల్టీ తన చర్యను సమర్థించుకుంది. సీవేజ్, వాటర్ పైప్ లైన్లు కామన్ వసతుల్లో భాగమని పేర్కొంది. అయితే, రెరా చైర్మన్ సత్యనారాయణ వాదనలు విన్న అనంతరం అనుమతించిన ప్లాన్ కు భిన్నంగా టాయిలెట్ నిర్మించినందున దీనిని అక్రమ నిర్మాణంగా భావించాలని స్పష్టం చేసింది. 30 రోజుల్లోగా ఫిర్యాదుదారు బాల్కనీ నుంచి డ్రైనేజీ పైప్ లైన్ తొలగించాలని ఆదేశించింది.
This website uses cookies.