రియల్ రంగానికి ఆర్ఐబీ అందజేస్తున్న మద్ధతును అభినందించి తీరాల్సిందేనని నరెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తక్కువుంటేనే రియల్ రంగానికి డిమాండ్ పెరుగుతుందన్నారు. కీలక రేట్లను యథాతథ స్థితిని కొనసాగించడం ద్వారా ఈ రంగం అభివృద్దికి ఆర్‌బీఐ సాయం చేసిందన్నారు. ఈ అవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఎందుకంటే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం.. కార్మికుల వ్యయం అధికం కావడం.. అనూహ్యంగా పెరిగిన భూముల రేట్ల వల్ల భవిష్యత్తులో ఫ్లాట్ల రేట్లకు మరింత రెక్కలు రావొచ్చన్నారు. ప్రస్తుతం రేట్లు తక్కువ ఉన్నందు వల్ల.. త్వరగా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు.
This website uses cookies.