Categories: TOP STORIES

మూడు ఫ్లాట్లు.. రూ.72 కోట్లు

  • ముంబైలో కొనుగోలు చేసిన ఫార్మా సంస్థ సీఈఓ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాజాగా ఓ ఖరీదైన రియల్ లావాదేవీ జరిగింది. ఓ ఫార్మా సంస్థకు చెందిన సీఈఓ రూ.72 కోట్లకు పైగా వెచ్చించి మూడు లగ్జరీ అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశారు. ఫార్మా కంపెనీ అల్థెరా సీఈఓ సంజీవ్ అగర్వాల్ దక్షిణ ముంబైలోని రహేజా మోడరన్ వివేరియాలో మూడు లగ్జరీ ఫ్లాట్లు కొన్నారు. కె రహేజా కార్ప్ ద్వారా ఈ కొనుగోలు జరిగింది. 2,891 చదరపు అడుగులు, 217 చదరపు అడుగుల బాల్కనీని కలిగి ఉన్న మొదటి అపార్ట్ మెంట్‌ను ఫిబ్రవరి 17న రూ.రూ.26.42 కోట్లకు కొనుగోలు చేశారు. 2,364 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండవ అపార్ట్ మెంట్‌ను ఫిబ్రవరి 17న రూ.20.09 కోట్లకు కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపిస్తున్నాయి.

2,873 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని, 217 చదరపు అడుగుల బాల్కనీని కలిగి ఉన్న మూడో అపార్ట్ మెంట్ ను గతేడాది మే 22న రూ.26.14 కోట్లకు కొనుగోలు చేశారు. మొత్తం 8,100 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మూడు అపార్ట్ మెంట్‌లను రూ.72.65 కోట్లకు రెండు దశల్లో కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపిస్తున్నాయి. మూడు అపార్ట్ మెంట్‌లకు దాదాపు రూ.4.35 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.90,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపించాయి. మూడు అపార్ట్ మెంట్‌లు ఏడు కార్ పార్కింగ్ స్థలాలతో వస్తాయని ఒప్పందంలో ఉంది. కాగా, గత మూడు సంవత్సరాలలో అనేక అధిక-నికర-విలువ గల వ్యక్తులు దక్షిణ ముంబైలోని రహేజా మోడరన్ వివేరియాలో లగ్జరీ అపార్ట్ మెంట్‌లను కొనుగోలు చేశారు.

AddThis Website Tools