poulomi avante poulomi avante

ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ ప్ర‌క్రియ‌ గ‌డువు స‌మీపిస్తోంది.. గండం గ‌డిచేదెలా?

  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద‌రఖాస్తుదారులు

తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020 మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ మేరకు ప్రజల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎల్ఆర్ఎస్ ప్ర‌క్రియ‌ను రెండు ర‌కాలుగా పూర్తి చేసుకునే వీలును క‌ల్పించారు. అయితే, ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తుదారులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే ఎల్ఆర్ఎస్ కోసం వెబ్ సైట్ ను సంద‌ర్శించేవారు ఏం చేయాలి? అసలు ఈ వెబ్ సైట్ ఎలా పని చేస్తుంది? ప్రజలు ఏ విధంగా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ ను వినియోగించుకోవాలి? రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక కథనం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మందకొడిగా సాగుతోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ లోనే దరఖాస్తులను క్లియర్ చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ.. కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపేందుకు అధికారులు ముందుకు రావ‌ట్లేదు. ఆన్ లైన్లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కి సంబంధించిన డేటా మాత్రమే లభ్యమవుతుంది. ఈ క్రమంలో ఎదుర‌య్యే సమస్యల్ని ఎలా పరిష్కరించాలో తెలియక దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ద‌రఖాస్తును పరిశీలించడం ఎలా?

ముందుగా https://lrs.telangana.gov.in/ అనే వెబ్ సైట్ ను సందర్శించాలి. ఇక్కడ హోమ్ లోకి వెళ్లగానే ఆఫీసర్స్ లాగిన్, మరియు సిటిజన్ లాగిన్ ఉంటుంది.

  •  సిటిజన్ లాగిన్ ని క్రియేట్ క్లిక్ చేసిన వెంటనే మనం ఎల్ఆర్ఎస్ దరఖాస్తు తో పాటు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి ఓటీపిని వాలిడేట్ చేసుకోవాలి.
  • ఓటీపి వాలిడేట్ అయిన వెంటనే మన ఎల్ఆర్ఎస్ దరఖాస్తు యొక్క ప్రస్తుత పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్న వ్యూ స్టేటస్ ను ఒకసారి క్లిక్ చేస్తే ఈ దరఖాస్తు ఎక్కడ ఉంది, ఏ శాఖ దగ్గర, ఏ అధికారి దగ్గర పెండింగ్ లో ఉందన్న సమాచారం క‌నిపిస్తుంది.
  • ఈ దరఖాస్తుకు సంబంధించి పెండింగ్ ఎట్ ఎల్ వన్ ఆఫీసర్ అని ఉంటుంది. ఎల్ వన్ ఆఫీసర్ అంటే ప్రతి మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ లో కానీ టౌన్ ప్లానింగ్ విభాగంలో క్రింది స్థాయి ఆఫీసర్ వద్ద మన దరఖాస్తు పెండింగ్ లో ఉందని అర్థం చేసుకోవాలి.

ఎల్ఆర్ఎస్ ఫీజు తెలుసుకోవడం ఎలా?

ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు ఇంటిమేటెడ్ అని మనకు ఆన్ లైన్ లో కనిపిస్తుంది. మన దరఖాస్తుకు సంబంధించి ఎంత ఫీజు చెల్లించాల‌న్న సమాచారం ఆన్ లైన్ లో క‌నిపిస్తుంది. అప్పుడు మనం ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పే ని క్లిక్ చేయగానే ఈ దరఖాస్తుదారులకు సంబంధించి ఎల్ఆర్ఎస్ కు ఎంత మేర డబ్బులు చెల్లించాల‌నే సమాచారాన్ని తెలియజేస్తుంది.

  • ప్రభుత్వం చెబుతున్న విధంగా 2020 లో మనం దరఖాస్తు చేసినప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఆధారంగా రెగ్యులరైజేషన్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అదేవిధంగా 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలను సైతం క‌ట్టాల్సి ఉంటుంది.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే?

ఎల్ఆర్ఎస్ ఛార్జీ మరియు ఓపెన్ స్పేస్ ఛార్జీ.. ఈ రెండింటిని కలిపిన తర్వాత 25 శాతం రాయితీ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఫైనల్ గా ఎంత మేర ఛార్జీ చెల్లించాలన్న సమాచారం మనకు ఆన్ లైన్ లో క‌నిపిస్తుంది. ఆన్‌లైన్‌లో సదరు డబ్బులను చెల్లిస్తే ఒక రసీదు జనరేట్ అవుతుంది. ఆ రశీదును జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి. ఈ రశీదు ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వారం నుంచి పది రోజుల వ్యవధిలో మనకు సంబంధించిన ప్లాట్ వద్దకు వచ్చి స్వయంగా పరిశీలిస్తారు. సదరు ఇంటి స్థలం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉందని అధికారులు నిర్ధారించుకున్న తరువాత ఎల్ఆర్ఎస్ పూర్తయినట్టుగా ప్రొసీడింగ్ ఫారంను అందజేస్తారు.

రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఎల్ఆర్ఎస్ చెల్లింపు

ప్రభుత్వం నిషేధం విధించిన లేఔట్ల‌లో 10 శాతం రిజిస్ట్రేషన్ అయి ఉండి, మిగతా 90 శాతం రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ విధానంలో అటు ప్రభుత్వం చెబుతున్న‌ విధంగా ఎల్ఆర్ఎస్ తో పాటుగా ప్లాట్ ను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లేఔట్ అభివృద్ది చేసిన వారి వద్ద నుంచి ప్లాట్ ను.. మనం ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్నట్లయితే ఈ విధానాన్ని అనుస‌రించాలి. ఇందుకోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ https://registration.telangana.gov.in/ ఓపెన్ చేయాలి. వెబ్ సైట్ ఓపెన్ కాగానే మొదట ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ ఆర్ ఎస్ పై క్లిక్ చేయాలి. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీని ఇక్కడ క‌నిపిస్తుంది. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ లో ఆ సైట్ ఎక్కడిది, ఏ సర్వే నెంబర్ లోనిది అన్న పూర్తి సమాచారాన్ని ఇక్కడ నమోదు చేయాలి.

  •  ప్రాపర్టీ డిటెయిల్స్ నమోదు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ శాఖ సైతం ఆటోమేటిక్ గా మన ప్లాట్ కు ఎంత రిజిస్ట్రేషన్ విలువ అవుతుందన్న సమాచారాన్ని చూపెడుతుంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత, అక్కడ ఉన్న మార్కెట్ విలువ ఎంత అన్న సమాచారం డిస్ ప్లే అవుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన‌ రుసుముకు సంబంధించిన సమాచారం ఇక్కడ కనిపిస్తుంది. ఆ తరువాత మనకు ప్లాట్ అమ్ముతున్న వారి వివరాలను సెల్లర్ డిటెయిల్స్ లో నమోదు చేయాల‌ని గుర్తుంచుకోండి. వారికి సంబంధించిన ఏదైనా గుర్తింపు కార్డును కూడా ఇందులో పొందుపరచాలి. ప్లాటు కొంటున్న వారి వివరాలను బయ్యర్ డీటెయిల్స్ లో నమోదు చేయాలి. ఇలా కొనుగోలుదారు, అమ్మకందారు వివరాల్ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ప్లాట్ కు ఎంత ఎల్ఆర్ఎస్ చెల్లించాలో సమాచారాన్ని చూపిస్తుంది. అయితే మన ప్లాట్ రిజిస్ట్రేషన్ తో పాటుగా ఎల్ఆర్ఎస్ ను కూడా పూర్తి చేస్తేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఎంత ఫీజు చెల్లించాలన్న సమాచారం తర్వాత పేమెంట్ చేయాల్సిన మొత్తం ఎంత చేయాలి అన్న వివరాలు తెలుస్తాయి. అంటే అటు ప్రభుత్వానికి సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చెల్లించాల్సిన ఛార్జీ, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ఛార్జీ ఆన్ లైన్ లో కనిపిస్తుంది. ఆ తరువాత ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే అటోమెటిక్ గా రశీదు జనరేట్ అవుతుంది. రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి రశీదుతో పాటు డాక్యుమెంట్ తో ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇలా తెలంగాణ ప్రభుత్వం రెండు విధాలుగా ఆన్ లైన్ లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేస్తోంది. కాక‌పోతే ఈ క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఒక లేఔట్ లోని ఒకే సర్వే నెంబర్ లో ఉన్న వేరు వేరు దరఖాస్తుదారులకు వేర్వేరుగా ఎల్ఆర్ఎస్ ఫీజు కనపడుతోంది. దీనికి కారణమేంటన్నది టౌన్ ప్లానింగ్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెప్పలేకపోతున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles