New Big Projects Permissions Increased in Hyderabad
మీరు హైదరాబాద్‌లోనే టాలెస్ట్ స్కై స్క్రేపర్‌లో నివసించాలని అనుకుంటున్నారా? అయితే, మీరేమాత్రం లేట్ చేయకుండా.. కోకాపేట్ సర్వీస్ రోడ్డులోకి విచ్చేస్తే చాలు.. జి ప్లస్ 57 అంతస్తుల ఎత్తులో.. సాస్ క్రౌన్ అనే మోడ్రన్ స్కై స్క్రేపర్ మీకు దర్శనమిస్తుంది.
హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యమే సాస్ క్రౌన్. జి ప్లస్ 57 అంతస్తుల ఎత్తయిన ఈ స్కై స్క్రేపర్.. కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో ఠీవీగా నిలబడుతూ దర్శనమిస్తుంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రేపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్‌లోని గోల్డన్ మైల్ లేఅవుట్‌లో సుమారు నాలుగున్నర ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. సుమారు ఐదు టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో.. కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశముంది. అంటే, ఆ 235 ఫ్యామిలీస్ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలని కోరుకునేవారి కోసం సుమారు ఇరవై ఐదు డ్యూప్లేలున్న ప్రాజెక్టే.. సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది.
This website uses cookies.