తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డు భూమిని జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేసిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లను వచ్చే నెల నుంచి అనుమతించనుంది.
ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు డజనుకు పైగా ప్రాజెక్టుల డెవలపర్లకు సమాచారం ఇచ్చింది. ప్రాపర్టీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ముందుకెళ్లాలని సూచించింది. ఇందులో యూనివర్సల్ రియల్టర్స్ ప్రాజెక్టులైన బోటానికా, ప్లాటినా, రాడిసన్ హోటల్, మంజీరా ట్రినిటీ ఉన్నాయి.