poulomi avante poulomi avante

వ‌చ్చే 5 ఏళ్లు.. 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు కోకాపేట్‌కు అందుకే డిమాండ్‌

  • నియోపోలిస్ కి అర్థం.. న్యూ సిటీ
  • కోకాపేట్.. అంద‌రికీ హాట్‌స్పాట్‌
  • ఇక్క‌డే జీసీసీ సెంట‌ర్ల ఏర్పాటు

హైద్రాబాద్‌- ఐటీ అండ్‌ రియాల్టీ సెక్టార్‌లో కోకాపేటది ప్రత్యేక స్థానం. కాదు కాదు స్టాండర్డ్‌ పారామీటర్‌ అంటే బాగుంటుందేమో..! కేవలం పదిహేనేళ్ల కాలంలోనే ఎవరూ ఊహించనంత అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం. ఆ.. ఏముంది అక్కడ- కొండలు.. బీడు భూములు తప్ప అని మూతి విరిచే రోజుల నుంచి కోకాపేటలో స్థలముందా అయితే మీరు కోటీశ్వరులే అనేంత రేంజ్‌లో డెవలప్మెంట్‌కి రోల్‌ మోడల్‌గా మారిపోయింది. మీ ప్రాంతాన్ని కోకాపేటలా వృద్ధి చేస్తామంటూ పాలకులు.. ప్రభుత్వాలే ప్రజలకు ప్రామిస్‌ చేసేంత ఘనత సాధించింది ఈ ప్రాంతం. అసలిదెలా సాధ్యమైందంటే ఇంట్రెస్టింగ్‌ జర్నీ కోకాపేటది. అటు కంపెనీలకి.. ఇటు బయ్యర్లకి కోకాపేట అంటే ఎందుకంత క్రేజో..? ఫ్యూచర్‌లో ఇంకెలాంటి డెవలప్మెంట్‌ రాబోతుందో ఓ సారి చూద్దాం.

కోకాపేట వెంటనే గుర్తొచ్చేది ఎకరం వందకోట్లు పలికిన భూమి విలువ. మోస్ట్‌ బిజియెస్ట్‌ మెట్రో సిటీస్‌లో కూడా సాధ్యం కాని ఈ రేర్‌ ఫీట్‌ కోకాపేట సొంతం. ఇక్కడి ల్యాండ్స్‌ దక్కించుకోడానికి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల మధ్య ఉన్న కాంపిటీషన్‌ కోకాపేట స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇక భారీ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి.. పోటాపోటీగా వెలుస్తున్న ఆకాశహర్మ్యాలు కోకాపేటని మోస్ట్‌ వాంటెడ్‌ ఏరియాగా మార్చాయ్‌. కోకాపేటలో భూమి అంటే బంగారం కన్నా ఎక్కువ. రియాల్టీ కంపెనీలకే కాదు.. ప్రభుత్వాలకు కూడా కల్పతరువే ఈ ప్రాంతం. వేలం వేసి ఖజనా నింపుకుంటున్నారంటేనే ఇక్కడి భూముల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆకాశాన్నంటుతోంది కోకాపేట రేంజ్‌.

మరి ఫ్యూచర్‌లో ఎలా ఉండనున్న‌ది? ఇక్కడ అభివృద్ధి మరిన్ని కొత్త పుంతలు తొక్కుతుందా? రెసిడెంట్స్‌కు అనుకూలమేనా? నియోపోలీస్‌ పక్కనే ఉండటం.. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ సహా ఐటీ కారిడార్‌లో ఖాళీ స్థలాల సంఖ్య తగ్గిపోవడంతో.. కంపెనీలన్నీ కోకాపేట వైపే దృష్టి సారించాయ్‌. ఇక వచ్చే ఐదేళ్లలో కోకాపేట్‌లో దాదాపు 10 లక్షల మంది పని చేసుకునేలా.. అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో మారుమూల శివారు ప్రాంతం. గండిపేట మండలంలో ఓ చిన్న గ్రామం. నిర్మాణం పూర్తయ్యి- అవ్వని రోడ్లు.. అక్కడక్కడ పంట పొలాలు. మెజార్టీ భాగం కొండలు- గుట్టలు. నీరు ఎండిపోయి పడి ఉన్న బీడు భూములు. 15 ఏళ్ల క్రితం వరకు కూడా కోకాపేట ఇలాగే ఉండేది. మరి ఇప్పుడో కోకాపేట అంటే అభివృద్ధికి కొలమానం. ఆకాశాన్ని అందుకునేలా నిర్మాణం జరుపుకొంటున్న స్కైస్క్రేపర్లు, మల్టీ నేషనల్‌ కంపెనీలు, విశాలమైన రోడ్లు, అద్భుతమైన కనెక్టివిటి.. ఒకటేంటి అంతలోనే ఇంత మార్పా అనే స్థాయిలో అభివృద్ధి చెందింది. బహుశా స్థానికులు కూడా ఎప్పుడూ అనుకుని ఉండరు తమ ప్రాంతం ఇంతలా వృద్ధి చెందుతుందని. కోకాపేటది ఇప్పుడు ఇంటర్నేషనల్‌ సిటీ రేంజ్‌.

ఐటీ కారిడార్‌ను ఆనుకుని ఉండటమే కోకాపేట చేసుకున్న అదృష్టం. హైద్రాబాద్‌లో హైటెక్‌ సిటీతో మొదలైన ఐటీ డెవలప్‌మెంట్‌- మాదాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ అంటూ కోకాపేట వరకు వెళ్లిపోయింది. కంపెనీలకు దగ్గరగా ఉండాలని ఎంప్లాయిస్‌.. సిటీలో స్థలం లేదు పక్కనే ఉన్న కోకాపేట అయితే బెటర్‌ అనుకుని కంపెనీలు.. అందరి ఫస్ట్‌ ఛాయిస్‌ కోకాపేటే అయిపోయింది. ఇంకేముంది తెలంగాణాలోనే ఎప్పుడూ ఎక్కడా చూడని డిమాండ్‌తో హైద్రాబాద్‌లోనే రిచెస్ట్‌ ఏరియాగా మారిపోయింది కోకాపేట.

కోకాపేట అంటే ఎకరా వంద కోట్లు పలికిన ల్యాండ్‌ వాల్యూతో పాటు రియల్‌ ఎస్టేట్‌కి కేరాఫ్‌ అని గుర్తు రావడం కూడా కామన్‌. లగ్జరీ అండ్‌ పీస్‌ఫుల్‌ లైఫ్‌ స్టైల్‌ను కోరుకునే వారికి ఫేవరేట్‌ ప్లేస్‌ ఉంది కోకాపేట. గండికోట చెరువు, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, వావ్‌ అనిపించే స్కై స్క్రేపర్స్‌, ఎటు చూసినా గేటెడ్‌ కమ్యూనిటీలు వీటంన్నిటి మధ్యలో కోకాపేట చెరువు. చెప్పలేనన్ని ఆకర్షణలెన్నో కోకాపేట- దాని పక్కనే నియోపోలీస్‌ చుట్టూ కనువిందు చేస్తున్నాయ్‌. ఎత్తులో ఉన్న ప్రాంతం కావడంతో నివాసానికి కోకాపేట అత్యంత అనువైనదిగా గుర్తించారు. అందుకే ఈ ప్రాంతం రియాల్టీ సెక్టార్‌కి కోటగా మారింది. సాస్‌ ఇన్‌ఫ్రా, పౌలోమీ, రాజపుష్ప, మై హోమ్‌ లాంటి హైద్రాబాద్‌లోని ప్రముఖ బిల్డర్లంతా కోకాపేటలో లగ్జరీ ప్రాజెక్ట్‌లు డెవలప్‌ చేస్తున్న వారే. ఐటీ డెవలప్‌ అయ్యాక గతంలోనూ ఇక్కడి భూములకి మంచి ధరే వచ్చినా.. అభివృద్ధి బాట పట్టిన తర్వాత మాత్రం ఫేట్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు కోకాపేటలో ల్యాండ్‌ అంటే హాట్‌ కేకే.

కోకాపేట పేరు ఈ స్థాయిలో మారు మోగిపోవడానికి మరో కారణం- నియోపోలీస్ లేఅవుట్‌. నియోపోలీస్‌ అంటే ఇటాలియన్‌లో న్యూ సిటీ అని అర్థం. ఈ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన డెవలప్‌ చూస్తే మతిపోవాల్సిందే. చెప్పడానికే లేఔట్‌- కానీ నిజంగా మరో కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ఇక్కడ అడుగు పెడితే హైద్రాబాద్‌లో ఉన్నామా లేకపోతే ఏ ఫారిన్‌ కంట్రీలోనో ఉన్నామా అని షాకవడం ఖాయం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వరల్డ్‌ క్లాస్‌ ఫెసిలిటీస్‌ను ఏర్పాటు చేశారిక్కడ. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లో అభివృద్ధి జరుగుతున్న నియోపోలీస్‌ మొత్తం గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టే. 36, 45 అడుగుల వెడల్పైన విశాలమైన రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ పవర్‌ కేబుల్స్‌, డ్రింకింగ్‌ వాటర్‌, డ్రైనైజీ లైన్స్‌, వెలుగులు విరజిమ్మే స్ట్రీట్‌ లైట్స్‌, పార్క్‌లు ఒకటేంటి అన్నీ అత్యాధునిక మోడల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచస్థాయి నగరాలకు ఏ మాత్రం తీసిపోదు ఈ ప్రాంతం. ఇక నియోపోలీస్‌ చుట్టు పక్కల భూముల్లోనూ భారీ సంఖ్యలో 30 నుంచి 59 అంతస్థుల ఎత్తైన హై రైజ్‌ అపార్ట్‌మెంట్స్‌ వెలుస్తున్నాయ్‌. వీటిల్లో కమర్షియల్‌, ఆఫీస్‌ స్పేస్‌లతో పాటు గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్‌లు కూడా ఎక్కువే.

కోకాపేటకి ఇంత డిమాండ్‌ రావడానికి మరో ప్రధాన కారణం- జాగ్రఫికల్‌గా కోకాపేట ఉన్న లొకేషన్‌. హైద్రాబాద్‌ వెస్ట్‌జోన్‌లో ఉండటం.. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్‌ను ఆనుకుని ఉండటం కోకాపేట విలువను అమాంతం పెంచేసింది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాధాపూర్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఇలా కోర్‌ ఏరియాలన్నీ కోకాపేటి కూతవేటు దూరంలో ఉన్నాయ్‌. అందుకే అటు ఎంప్లాయిస్‌కి ఇటు కంపెనీలకి కోకాపేట మోస్ట్‌ వాంటెడ్‌ ఏరియా అయిపోయింది. అలాగే కనెక్టివిటీ కూడా. ఓఆర్‌ర్‌- ట్రిపుల్‌ ఆర్‌లతో కనెక్టైంది ఈ ప్రాంతం. ముంబై, నాగపూర్‌, వరంగల్‌, విజయవాడ, శ్రీశైలం, బెంగళూర్‌ సహా వివిధ నగరాలకు వెళ్లేందుకు మంచి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కోకాపేట నుంచి. ఇక నియోపోలీస్‌ నుంచి హైద్రాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఎక్సలెంట్‌ కనెక్టివిటీ ఉంది.

ఓఆర్‌ఆర్‌ రెండు నిమిషాల డ్రైవ్‌ అవే దూరమే. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు అయితే 5 నిమిషాలు.. హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 20 నిమిషాల్లో రీచ్‌ అవ్వొచ్చు. మెట్రోను కూడా కోకాపేట వరకు విస్తరిస్తామని గత- ప్రస్తుత ప్రభుత్వాలు ప్రకటించాయ్‌. కోకాపేట చుట్టూ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, మల్టీస్పెషాల్టీ హాస్పిటల్స్‌, ఎంటర్టైన్‌మెంట్‌ జోన్స్‌కి కొదువ లేదు. ఇదంతా జస్ట్‌ బిగినింగ్‌ మాత్రమే. ఫ్యూచర్‌లో ఇంతకు మించిన అభివృద్ధి జరగనుంది ఈ ప్రాంతంలో. ఇది అంచనా కాదు. కళ్లముందు కనబడుతున్న వాస్తవం. మరి ఇన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇక్కడ నివాసం ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే కోకాపేటలో భూములు కో అంటే కోట్లు పలికేది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles