హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం త్వరలో కొత్త భవనంలోకి మారనుంది. నానక్ రామ్ గూడలో నిర్మిస్తున్న ఈ కార్యాలయం దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఇది పూర్తయితే దక్షిణాసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఇదే అవుతుంది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ జనలర్ కార్యాలయం పైగా ప్యాలెస్ లో ఉంది. దీనిని వచ్చే ఏడాది ప్రథమార్థంలో కొత్త భవనంలోకి మారుతుందని భారత్ లో అమెరికా రాయబారి ఎలిజిబెత్ జోన్స్ వెల్లడించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 12.2 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,429 కోట్లు. కొత్త కార్యాలయంలో 54 వీసా ఇంటర్వ్యూ విండోలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలను యూఎస్ ఎంబసీ ఇటీవల షేర్ చేసింది.