Categories: Celebrity Homes

మొదటి ఇంటితో ముడిపడి ఉండేవి ఎన్నో

రియల్ ఎస్టేట్ గురుతో ఇషా తల్వార్

మొదటి ఇల్లు మనతో ఎంతటి అనుబంధాన్ని ముడి వేసుకుని ఉంటుందో సాస్, బహు ఔర్ ఫ్లెమింగో ఫేమ్ ఇషా తల్వార్ చక్కగా చెప్పారు. ఆ సంగతులు చెబుతున్నప్పుడు నాలుగు గోడల మధ్య ఆమె నవ్వులు తరంగాలు సృష్టించాయి. తరచుగా తాను మిస్ అయ్యేదేదో ఆమె అక్కడ కనుక్కుంటూ ఉంటారని అవగతమైంది. తాజాగా రోహిత్ శెట్టి వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ఇషా.. తన డ్రీమ్ హోమ్ గురించి బోలెడు సంగతులు ముచ్చటించారు.

‘నాలుగేళ్ల క్రితం నేను పొదుపు చేసిన డబ్బుతో సొంత ఇంటిని కొన్నాను. నేను పెద్దగా ఖర్చు కూడా చేయను. నిజానికి నా ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. చూడాలని కూడా అనుకోను. సృజనాత్మకమైన పని ఇస్తే చేయడానికి చాలా ఇష్టపడతాను. ఇక నా ఇంటిని నా తల్లిదండ్రులే చూశారు. వారు ఎంపిక చేసినదాన్ని నేను ఓకే చేశాను. చాలా కాలం తర్వాత నా కొత్త ఇంటిని చూశాను. మా నాన్న చాలా ప్రాక్టికల్ మనిషి. ఆయనే పెట్టుబడి పెట్టమని సూచించారు. మాకు వెర్సోవాలో మరో ఇల్లు కూడా ఉంది. నేను కూడా స్వతంత్రంగా జీవించడానికి ప్రయత్నించాను. కానీ ఇప్పుడు నా తల్లిదండ్రుల వద్దకు రావడానికే ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి స్వతంత్రంగా జీవించడం అనేది చాలా సుదీర్ఘ ప్రక్రియ. అన్నట్టు మాకు ఢిల్లోలో కూడా ఇల్లు ఉంది. ఎందుకంటే విభజన తర్వాత మా తాతలు రాజధానికి వలస వచ్చారు. వారు అక్కడ చాలా సంపన్నులు. ఆ క్రమంలో పాకిస్థాన్ లో 37 అంతస్తుల ఇంటిని విడిచి పెట్టాల్సి వచ్చింది’ అని ఇషా పేర్కొన్నారు.

‘ఈ ఏడాది మా పాత ఇంటి నుంచి బయటకు వచ్చాం. ఆ ఇంటిని అమ్మేశాం. అది చాలా బాధ అనిపించింది. మా అందరికీ అందులో 35 ఏళ్ల అనుబంధం ఉంది. నేను అక్కడే పుట్టాను. గత వారాంతంలో అక్కడకు వెళ్లాను.

ఎన్నో సంగతులు గుర్తుకొచ్చాయి. ఇంట్లోకి వెళుతుంటే నా కళ్ల ముందు ఎన్నో కదలాడాయి. అక్కడ వావ్ అనిపించే సంగతులూ ఉన్నాయి. బాప్ రే అనిపించే క్షణాలూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్నిసార్లు తెలియకుండానే అటువైపు వెళుతుంటాను. కండరాల జ్ఞాపకశక్తి అంటే ఇదేనేమో. కానీ నా అంతర్గత వ్యవస్థ ఎల్లప్పుడూ, ఎప్పటికీ నా మొదటి ఇంటికి తిరిగి వెళ్లడాన్ని స్వాగతిస్తుంది’ అని ఇషా వివరించారు. ఇషా తల్లిదండ్రులు ఆమె కలల ఇంటిని చాలా త్వరగా చూశారు. ‘ఇంట్లో ఎక్కువగా విలాసవంతమైన అలంకరణ ఉంటే.. దానిని శుభ్రపరిచేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆన్ లైన్ లో మనం చూసే వస్తువులపై ఎక్కువగా మనసు పారేసుకుంటాం. నా తల్లిదండ్రులు ఇప్పటికే అన్నీ అమర్చి ఉన్న ఓ చక్కని ఇంటిని చూశారు. నేను ఇంటి కోసం చేసే పనులు చాలా తక్కువ’ అని పేర్కొన్నారు.

‘నేను ఈ నగరం జీవితం యొక్క సందడి నుంచి దూరంగా జీవించాల్సిన సమయం వచ్చింది. అక్షరాలా ప్రకృతి ఒడిలో సేద తీరాలి.

నా సినిమాలు మాత్రమే నన్ను ఇక్కడ ఉంచుతున్నాయి. మానసికంగా మాత్రం నేను అక్కడే ఉంటున్నాను. నేన ఈ పరిశ్రమలో మరికొంత స్థిరపడిన వెంటనే ఆ పని పూర్తి చేస్తాను. ఆడిషన్ ప్రక్రియ గురించి నేను చింతించక్కర్లేదు. అప్పుడే మీరు ఈ పరిశ్రమలో ఏదైనా సాధించగలరు’ అని ఆమె స్పష్టంచేశారు. సెలబ్రిటీల ఇళ్లలో ఎవరి ఇల్లు నచ్చిందని అడగ్గా.. ఇషా భిన్నమైన సమాధానం ఇచ్చారు. ‘మేము ఒకరి ఇళ్లలో ఒకరు ఎక్కువగా తిరుగుతాం. కానీ అందరినీ ఆహ్వానించే అలవాటు నాకు ఉంది. ఈ మధ్యన ఇక్కడ సెలబ్రిటీలు చాలా రిజర్వుగా ఉన్నారని అనిపిస్తుంది. ప్రొఫెషనల్ మీటింగ్ ఉన్నంత వరకు మిమ్మల్ని ఇంటికి పిలవరు. ఇంటికి రావడానికి కూడా నియమాలు, నిబంధనలు ఉంటాయా? ఇది చాలా వింతగా ఉంటుంది. కానీ అపరిచితులు కూడా చాయ్ కోసం నా ఇంటికి వస్తారు’ అని తెలిపారు.

This website uses cookies.