poulomi avante poulomi avante

ఆ ఇళ్లకు ఆస్తి పన్ను లేదు

500 చదరపు అడుగులలోపు ఉన్న నివాస గృహాల య‌జ‌మానులు ఇక‌పై ఆస్తిపన్ను క‌ట్ట‌క్క‌ర్లేదు. ఈ మేరకు మ‌హారాష్ట్ర‌ మఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. వచ్చే నెలలో ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం ఉద్ధవ్ అధికారులను ఆదేశించారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో దాదాపు 16 లక్షలకు పైగా గృహాల యజమానులకు లబ్ధి కలుగుతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. కాగా, ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం దాదాపు రూ.468 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందని అధికారులు అంచనా వేశారు. 2020-21లో బీఎంసీకి దాదాపు రూ.6,738 కోట్ల ఆస్తిపన్ను వస్తుందని అంచనా వేశారు. అయితే, కరోనా కారణంగా అది రూ.4500 కోట్లకే పరిమితమైంది. ఇక 2021-22లో ఆస్తిపన్ను ద్వారా రూ.7వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles