Categories: TOP STORIES

ఈ 17 నగరాలు.. భవిష్యత్ రియల్ స్పాట్లు

2050 నాటికి దేశంలో 100 నగరాలు

కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి

భారత్ లో రియల్ రంగం పరుగులు పెడుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లో ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం తహతహలాడుతున్నారు. దేశంలోని ఏ నగరాలు రియల్ కు అనుకూలంగా ఉన్నాయో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో 17 నగరాలు రియల్ కు హాట్ స్పాట్ గా మారనున్నాయని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది.

ఉత్తరాన అమృత్ సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి ఉండగా.. తూర్పున పాట్నా, పూరి.. పశ్చిమాన ద్వారక, నాగ్ పూర్, షిర్డీ, సూరత్, దక్షిణాన కొయంబత్తూర్, తిరుపతి, విశాఖ, ఇండోర్ ఉన్నాయి. ఈ నగరాలన్నీ కార్యాలయాలు, గిడ్డంగులు, టూరిజం, రెసిడెన్షియల్, సీనియర్ లివింగ్ సహా వివిధ కేటగిరీలో వేగవంతమైన వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. వికేంద్రీకృత పని వాతావరణం, టైర్ టూ నగరాల వైపు ప్రాధాన్యత మారడం ఈ వృద్ధికి కీలకంగా మారాయి. వర్క్ స్పేస్ ల్యాండ్ స్కేప్ లలో మార్పులు, వివిధ కారిడార్లలో మౌలిక సదుపాయాల పెరుగుదల, పర్యాటకం (ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం), ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల పెరిగిన డిజిటలైజేషన్ వంటి నాలుగు ప్రధాన అంశాలు రియల్ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయని కొలియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు.

కొయంబత్తూర్, ఇండోర్, కొచ్చి బలమైన శాటిలైట్ ఆఫీస్ మర్కెట్లుగా ఎదుగుతుండగా.. జైపూర్, కాన్పూర్, లక్నో, నాగ్ పూర్, పాట్నా, సూరత్ లు డిజిటలైజేషన్ పెంచుతాయని అంచనా వేస్తున్నారు. అమృత్ సర్, అయోధ్య, ద్వారక, పూరి, షిర్డీ, తిరుపతి, వారణాసి వంటి నగరాలు ఆధ్యాత్మిక పర్యాటకం వృద్ధి నుంచి ప్రయోజనం పొందుతాయని పేర్కొంటున్నారు. 2050 నాటికి భారత్ లో ఎనిమిది మెగా సిటీలతోపాటు దాదాపు 100 నగరాలు ఉంటాయని అంచనా. నేషనల్ ఇన్ ఫ్రాస్టక్చర్ పైప్ లైన్ (ఎన్ఐపీ), పీఎం గతిశక్తి ప్రాజెక్టులు టైర్-1 నగరాలను వృద్ధివైపు తీసుకెళ్తాయని నివేదిక పేర్కొంది.

మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాలు ఈ అభివృద్ధి చెందుతున్న హాట్ స్పాట్ లలో గిడ్డంగులు, రెసిడెన్షియల్ విభాగాల్లో డిమాండ్ పెంచుతాయని విశ్లేషించింది. హైబ్రిడ్ మోడల్స్ వైపు మారడం వల్ల చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్ లకు డిమాండ్ పెరుగుతోంది. డిటిల్ వ్యాప్తి చిన్న పట్టణాలను డేటా సెంటర్లు, స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం హబ్ లుగా మారుస్తోంది. జైపూర్, కాన్పూర్, లక్నో వంటి నగరాలు ఈ-కామర్స్ కు సంబంధించిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు కీలకంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies.