ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ఎలాంటి ప్రాంతంలో ఏ రకమైన ఫ్లాట్ తీసుకోవాలని సతమతమవుతున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే.. ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఈ అంశాలను పరిశీలించండి.
లిఫ్టుల సంఖ్య, వాటి సామర్థ్యం, మెట్లు, వాటి వెడల్పు, మిడ్ ల్యాండింగ్ వెడల్పు, కారిడార్ వెడల్పు, ఫ్లోర్ టు ఫ్లోర్ ఎత్తు తదితర వివరాలతో సహా అన్ని బ్లాకుల ఫ్లోర్ ప్లాన్లు బ్రోచర్లు చూడాలి. చాలా సందర్భాల్లో కామన్ ఏరియాపై అధిక చార్జీ విధిస్తారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి
పవర్ కనెక్షన్ ఎలాంటిది? దాని సామర్థ్యం ఎంతో చూడాలి
ఎన్ని బోర్లు ఉన్నాయి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వాటర్ బోర్డు సరఫరా చేసే నీటిపై ఆధారపడతారా? ఎండాకాలం వస్తే నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుందా? ఈ అంశం చాలా కీలకమని గుర్తుంచుకోండి
ప్రతి ఫ్లాట్ అవిభక్త భూమి వాటా (యూడీఎస్) స్పష్టంగా ఉండాలి
క్లబ్ హౌస్, స్విమింగ్ పూల్ తదితర సౌకర్యాలు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తంతోనే ఏర్పాటు చేస్తారు. వీటిని సరిగా మెయింటైన్ చేయడం కోసం ఓనర్స్ అసోసియేషన్ కు అప్పగించాలి. ఒకవేళ ఇవి బిల్డర్ లేదా డెవలపర్ కొంతకాలం నిర్వహిస్తున్నాడంటే.. అదనపు ఛార్జీలు విధించకూడదు
ఎలక్ట్రికల్, నీటి సరఫరా, శానిటరీ ఫిట్టింగులు, లిఫ్టులు మీరు నిర్దేశించినవిగా ఉండాలి. ఇందుకోసం కనీసం మూడు బ్రాండ్లను ఎంచుకోండి
లోపలి గోడలు, సీలింగ్ కు నాణ్యమైన పీఓపీ తప్పనిసరి
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారు పార్కింగుల కోసం ఒకే రేటు వసూలు చేయాలి. పార్కింగ్ ఏరియా పరిమాణం కూడా సూచించాలి. కచ్చితమైన రేటు కోసం ఫ్లాట్ చదరపు అడుగు రేటు ఎంచుకుంటే బాగుంటుంది. కారు పార్కింగ్ నెంబరును అగ్రిమెంట్‌లో తప్పకుండా నమోదు చేయాలి
ఫైర్ ఫైటింగ్, రూఫ్ పై హెలి ప్యాడ్, ఫైర్ ఎస్కేప్ మెట్ల కోసం ఫోర్స్ డ్ వెంటిలేషన్ వంటి తప్పనిసరి అంశాలు డ్రాయింగ్ లో ఉన్నాయా? లేవా? అన్నది గమనించాలి
లిఫ్టల పక్కనే ఉండే బెడ్ రూమ్స్ ను డక్ట్ తో వేరు చేసి ఉన్నాయో లేదో చూసుకోవాలి
ఒకవేళ ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఉపసంహరించుకుంటే ఎంత మొత్తం మినహాయించుకుని మిగతా మొత్తం ఎప్పటిలోపు ఇస్తారో తెలుసుకోవాలి
ఒకవేళ రుణం పొందినట్టయితే లోన్ డ్రా షెడ్యూల్ లేదా చెల్లింపు షెడ్యూల్ ఒప్పంద పత్రంలో స్పష్టంగా ఉండాలి
ఎంతో పోటీ ధరలో బుకింగ్ చేసుకుంటారు కాబట్టి, బిల్డర్ నిర్మాణంలో పురోగతి సాధించకపోతే, జాప్యమయ్యే కాలానికి బిల్డర్ ఎంత మొత్తం వడ్డీ చెల్లిస్తారో తెలుసుకోవాలి
మరో ముఖ్యమైనం అంశం ఏమిటంటే.. ఫ్లోరింగ్ మార్చకోవడం లేదా మాడ్యులర్ కిచెన్ కావాలనుకునే కొనుగోలుదారుల ఇష్టాలను బిల్డర్ అనుమతించాలి. మైనర్ కష్టమైజేషన్ కింద డోర్లు, షెల్ఫ్ లు, ఏసీ ఇన్ స్టాలేషన్లు వంటి వాటి స్థానాలను మార్చడానికి బిల్డర్ అనుమతించాలి
ఇక అన్ని బెడ్ రూమ్స్ లోకి ఫర్నిచర్ తరలింపు సులభంగా వెళ్లేలానే ఉంటుంది. డైనింగ్ హాలులోకి ప్రవేశాన్ని లేదా డైనింగ్ ఏరియా కనపడకుండా ఉండటానికి ‘ఎల్’ ఆకారాపు హాలుకు ప్రాధాన్యత ఇస్తారు. బాల్కనీ కనీసం నాలుగు అడుగుల వెడల్పు ఉండాలి. వంటగది కోసం ఓ బాల్కనీ, సిటవుట్ కోసం ఓ బాల్కనీ ఎంచుకోవచ్చు. వాస్తు ప్రకారం తలుపులు, కిటికీల సంఖ్య ఉండాలి. తగినంత వెంటిలేషన్ ఉన్న కిచెన్ ఉంటే అది చక్కని ఫ్లాట్ డిజైన్ అన్నమాట. ప్లాన్ ను జాగ్రత్తగా పరిశీలించాలి. అనవసరమైన గోడలు, స్థల వృథా ఉండకూడదు
బిల్డర్ భూమి కొనుగోలు పత్రాలు లేదా డెవలప్ మెంట్ అగ్రిమెంట్ మొదలైన వాటిని బుకింగ్ సమయంలో కొనుగోలుదారులకు చూపించాలి. భూ యజమాని, బిల్డర్ ఇద్దరూ ఫ్లాట్ సేల్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలి. ఒకవేళ బిల్డర్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేయకుండానే ఈ ప్రాతిపదికన నిర్మాణం చేపడితే.. ఫ్లాట్ బుకింగ్ సమయంలో ఈ ఫార్మాట్ కొనుగోలుదారులకు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే కొనుగోలుదారులు నష్టపోతారు. హైదరాబాద్ లోని శంకర్ మఠానికి సమీపంలో విఘ్నౌరి ఉంది. ఇక్కడి ప్లాట్లను ప్రభుత్వ హౌసింగ్ సంస్థ తీసుకుంది. దాదాపు 45 ఏళ్లు గడిచిపోయాయి. కొనుగోలుదారులు తమకు భూమి వాటా వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ హౌసింగ్ సంస్థ తాము కేవలం భవనాన్ని మాత్రమే విక్రయించామని, భూమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పింది. ఈ సమయంలో వారు కోర్టుకు వెళ్లడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? అందువల్ల ఇప్పుడు కొనుగోలు చేసిన ఫ్లాట్ జీవిత కాలం తర్వాత (60 ఏళ్ల తర్వాత) ఫ్లాట్ ప్రస్తుతం ధర కంటే అవిభక్త వాటా ధర ఎక్కువగా ఉంటుందనే సంగతి మరిచిపోవద్దు