స్ఫూర్తిదాయకం.. టెక్నో పేయింట్స్
అధినేత శ్రీనివాస్‌రెడ్డి పయనం..
- ప్రస్తుతం రోజుకు 5 వేల మంది
పెయింటర్లు పని చేస్తున్నారు - 23 ఏళ్లుగా పెయింటింగ్ సేవలు అందిస్తున్నాం
- బెటర్ క్వాలిటీ, బెటర్ సర్వీస్,
ఆన్ టైమ్ డెలివరీ మా ప్రత్యేకత - ఈ విషయంలో మాకు పోటీయే లేదు
- హైరైజ్ టవర్లకు పెయింటింగ్
వేసే సుశిక్షిత సిబ్బంది మా సొంతం - టెక్నో పెయింట్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
టెక్నో పెయింట్స్ ప్రస్థానం పది మందితో మొదలై.. ప్రస్తుతం రోజుకి 5వేల మంది పెయింటర్లు పని చేసే స్థాయికి వచ్చిందని ఆ కంపెనీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పెయింటింగ్ కాంట్రాక్టుల నుంచి మొదలైన తమ ప్రయాణం.. ప్రస్తుతం టాప్-3 పెయింటింగ్ కంపెనీల వరకు చేరిందని వెల్లడించారు. పెయింటింగ్ రంగంలోకి ప్రవేశించి 23 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రియల్ ఎస్టేట్ గురుకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ..
పెయింటింగ్ రంగంలోకి మీరు ఎలా రావాలనుకున్నారు?
- పెయింటింగ్ తయారీ రంగంలోకి 2001లో ప్రవేశించాం. అంతకుముందు మేం పెయింటింగ్ కాంట్రాక్టులు చేసేవాళ్లం. తర్వాత మా సొంత అవసరాల కోసం 2001లో పెయింటింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టాం. పది మంది ఉద్యోగులతో చిన్న యూనిట్ గా మా ప్రస్థానం మొదలైంది. తర్వాత 2004లో రిటైల్ నెట్ వర్క్ లోకి కూడా అడుగుపెట్టాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు విస్తరించాం. టెక్నో పెయింట్స్ అనే బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్లాం. కాంపిటీటర్స్ కంటే ఓ ప్రత్యేక మోడల్ ను అభివృద్ధి చేసుకున్నాం. ఈ నెల 25 నాటికి టెక్నో పెయింట్స్ ప్రారంభమై 23 ఏళ్లు పూర్తవుతుంది.
అన్ని పెయింట్స్ కంపెనీల కంటే మాది కొంచెం వేరుగా ఉంటుంది. మాది డిఫరెంట్ యూనిక్ మోడల్. మాన్యుఫ్యాక్చరింగ్, అప్లికేషన్ సర్వీసులు అందజేసే ఏకైక కంపెనీ మాదే. రియల్ ఎస్టేట్ లేదా కమర్షియల్.. ఇలా ఏ ప్రాజెక్టు అయినా సరే నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేస్తున్నది ఒక్క టెక్నో కంపెనీ మాత్రమే. మిగిలిన కంపెనీలు పెయింట్స్ సరఫరా చేసేసి, థర్డ్ పార్టీకి బదలాయిస్తుంది. కానీ టెక్నో కంపెనీ ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ప్రతి ప్రాజెక్టునూ విజయవంతంగా ఆన్ టైమ్ లో పూర్తి చేసిన రికార్డు మా సొంతం. అందువల్లే పెయింట్ అప్లికేషన్స్ కు సంబంధించి డెవలపర్లు, బిల్డర్లు తొలుత ఎంచుకునేది మమ్మల్నే. తొలినాళ్లలో ఇది మాకు చాలా సవాల్ గా అనిపించింది. కానీ దాన్ని అధిగమించి ఇప్పుడు చాలా సులభంగా పూర్తి చేస్తున్నాం.
ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె వంటి 6 మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాం. రెండేళ్లలో 10 నుంచి 12 మెట్రోలకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించి ఆ మేరకు కసరత్తు చేస్తున్నాం. మా సర్వీసులు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. మాకు తెలంగాణ స్కూళ్ల ప్రాజెక్టు అప్పగించింది. దాదాపు రూ.858 కోట్ల ప్రాజెక్టును ప్రభుత్వం మాకు ఇచ్చింది. ప్రస్తుతం అది పురోగతిలో ఉంది. ఇప్పటివరకు మేం వెయ్యికి పైగా కార్పొరేట్ ఆర్డర్లు విజయవంతంగా పూర్తి చేశాం. 50 అంతస్తుల వంటి హైరైజ్ టవర్స్ లో పని చేయాలంటే భద్రతా ప్రమాణాలు చాలా ముఖ్యం. మేం ఈ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. అందువల్ల ఇప్పటివరకు మా ప్రాజెక్టుల్లో చిన్న ప్రమాదం కూడా జరగలేదు.
భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
- ఎక్స్ టర్నల్ పెయింటింగ్ చేసేటప్పుడు గండూలాస్ ఉపయోగిస్తాం. బ్యాంబూస్, స్కాఫోల్డింగ్ పూర్తిగా మానేశాం. గండూలాస్ లేదా ఎస్సార్పీలతో పని చేయడం వల్ల అత్యంత భద్రత ఉంటుంది. 50 అంతస్తులకు పైగా ఉన్న హైరైజ్ టవర్స్ లో పెయింటింగ్ చేసే కంపెనీ టెక్నో కంపెనీ మాత్రమే. మా దగ్గర అంత సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. ప్రతి ప్రాజెక్టునూ నాణ్యతతో అనుకున్న సమయానికి డెలివరీ చేయడం చాలా ముఖ్యం. పెయింటింగ్ అనేది చాలా కీలకం. చూడటానికి చాలా చిన్న పనిగా అనిపిస్తుంది. కానీ చాలా పెద్ద చాలెంజ్. పెయింటింగ్ వేసేటప్పుడు ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి చాలా అంశాలతో సమన్వయం చేసుకోవాలి. లేకుంటే ప్రాజెక్టును అనుకున్న సమయానికి అప్పగించలేం. మేం ప్రతి ప్రాజెక్టునూ ఓనర్ షిప్ తీసుకుని మరీ పూర్తి చేస్తాం. మిగిలిన కాంపిటీటర్లు అలా చేయరు. ఎవరో ఎగ్జిక్యూటివ్ వచ్చి ఆర్డర్ తీసుకుని, ఆ పనిని థర్డ్ పార్టీకి అప్పగించి వెళ్లిపోతాడు. కానీ మేం అలా కాదు. మేం ఓ యూనిక్ మోడల్ తో పని చేయడం వల్లే ఈరోజు ఈ స్థితికి రాగలిగాం. మా దగ్గర ప్రతి రోజూ దాదాపు 5 వేల మంది పెయింటర్లు పని చేస్తుంటారు. 50 మంది బిజినెస్ అసోసియేట్లు, సూపర్ వైజర్లు.. ఇలా ఓ వ్యవస్థలా పని చేస్తుంది. ఏ కంపెనీ అయినా సరే టెక్నో పెయింట్స్ తో సమానంగా చేయలేరని చాలెంజింగ్ గా చెబుతున్నా.
పెయింటింగ్ ప్రపంచంలో పోటీలను ఎదుర్కొని ఎలా ఇంత ఉన్నత స్థానానికి ఎదిగారు?
- కాంపిటీషన్ అనేది ప్రతి ఇండస్ట్రీ, ప్రతి ప్రొడక్టుకూ ఉంటుంది. కాంపిటీషన్ ను ఎదుర్కోవడానికి సరైన ఎఫర్ట్స్ పెట్టాలి. సరైన టీమ్ ను సరైన పొజిషన్లోకి తీసుకువచ్చి, దానికి ఓ యూనిక్ బిజినెస్ మోడల్ తయారు చేసుకోగలిగితే చాలు. ప్రతి రోజూ కనీసం 12 నుంచి 14 గంటలు పని చేయడం నాకు అలవాటు. మా టీం చేత కూడా ఇలా పని చేయిస్తాం. అంతేకాకుండా మా కంపెనీలో ఎంప్లాయి మోడల్ కాకుండా ఎంటర్ ప్రెన్యూర్ మోడల్ తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టులో ఒక్కో విభాగానికి ఒక్కో షేర్ అని కేటాయించాం. మా కంపెనీలు ఉద్యోగులు ఎవరూ ఉండరు. అందరూ ప్రతిరోజూ రెవెన్యూ సంపాదించుకునేవాళ్లే. కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ తమ పనిని నిజాయితీగా పని చేయాలంటే వారికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. మేం అదే చేశాం. మా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కూడా కనీసం వంద కార్లలో రాగల స్థాయికి ఎదిగారు.
టెక్నో పెయింట్స్ అనే పెద్ద సంస్థను స్థాపించడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
- నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే చాలా ఇష్టం. మా బ్రదర్ కి చిన్న చిన్న బిజినెస్ లు ఉండేవి. అందువల్ల నేను ఐదు, ఆరు తరగతులు చదువుతున్నప్పుడే నన్ను అందులో కూర్చోబెట్టేవారు. అందువల్ల ఆటోమేటిగ్గా నాకు బిజినెస్ పై ఆసక్తి పెరిగింది. నా చదువు పూర్తయిన తర్వాత ఎక్కడ జాబ్ చేసిన 6 నెలలకు మించి చేసేవాడిని కాదు. జాబ్ అనేది బోరింగ్ అనిపించేది. ఈ క్రమంలో ఓ పెయింటింగ్ కంపెనీలో సూపర్ వైజర్ గా వెళ్లాను. ఇన్ని రకాల రంగులు ఉన్నాయని నాకు అప్పుడే తెలిసింది. అక్కడ కూడా 6 నెలలకు మించి పని చేయలేదు. కానీ పెయింటింగ్ కు సంబంధించి అన్ని వివరాలూ తెలుసుకున్నా. తర్వాత చిన్న చిన్న పెయింటింగ్ కాంట్రాక్టులు చేశాను.
అనంతరం ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో ఏసియన్ గేమ్స్, ఐటీ పార్క్స్, ఇండోర్ స్టేడియాలు, ఐ మ్యాక్స్ వంటి పెద్ద ప్రాజెక్టులు నేనే చేశాను. ఆ సమయంలోనే దాదాపు వెయ్యి మందితో పని చేయించాను. నిబద్ధతతో పని చేయిస్తుండటంతో మార్కెట్లో మంచి పేరొచ్చింది. తర్వాత పెయింట్స్ షాప్ కూడా పెట్టాను. అనంతరం ఎవరి దగ్గరో పెయింట్స్ కొనడం ఎందుకు? మనమే మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కంపెనీ మొదలుపెట్టాం. ఓ దశలో రియల్ ఎస్టేట్ లో చాలా మంచి అవకాశాలు వచ్చినప్పటకీ, పెయింటింగ్ ను వదలాలని అనిపించలేదు. పెయింట్స్ అనేది నాకు ఓ ప్యాషన్ లా అయిపోయింది. ఆ క్రమంలోనే ప్రస్తుతం టెక్నో పెయింట్స్ అనేది టాప్-2, టాప్-3 కంపెనీల సరసన చేరింది.
ఈ 23 ఏళ్ల జర్నీలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
- 2006, 2007 సమయంలో రిటైల్ లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ విషయంలో అంత అనుభవం లేకపోవడంతో కాస్త ప్రభావం పడింది. దానిని తర్వాత సరిదిద్దుకున్నాం. అయితే, దాదాపు 5 ఏళ్లు ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో చాలామంది ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసి కంపెనీని నిలబెట్టారు. రెండు మూడేళ్లు జీతాలు ఇవ్వకపోయినా తోడుగా ఉన్నారు. వారందరి సహకారంతో తప్పొప్పుడు సరిదిద్ది కంపెనీని ఈ స్థాయికి తెచ్చాం.
టెక్నో పెయింట్స్ కి మహేశ్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవాలని ఎందుకు అనుకున్నారు?
మాకంటూ బీ2బీలో ఓ పోజిషన్ కు వచ్చాం. అయితే, మన దేశంలో బీ2సీ అనేది చాలా పెద్ద మార్కెట్. ఇందులోకి మనం వెళ్లాలంటే మంచి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని అనుకున్నాం. ఓ నలుగురైదుగురిని ఎంచుకుని అందులో మహేశ్ బాబు అయితే బాగుoటుందని నిర్ణయానికి వచ్చాం. ఆయనకు ఉన్న లుక్ కి సరిగ్గా కనెక్ట్ అవుతారని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. స్టోరీ ఐడియాల్లో ఆయన ఇన్వాల్స్ అయ్యారు. యాడ్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. నో బీపీ.. ఓన్లీ టీపీ అనేది చిన్నపిల్లాడు డైలాగ్ కొట్టే స్థాయికి మా యాడ్స్ రీచ్ అయ్యాయి.ఎన్నో కంపెనీలున్నాయి కదా.. మరి, అందులో టెక్నో పెయింట్స్ ప్రత్యేకత ఏమిటి?
- పెయింటింగ్స్ తయారీలో వినియోగించే ముడి పదార్థాలన్నీ ఇంపోర్టెడ్. అయితే, అవి ఎంత పెద్ద బ్రాండ్ వి అయినప్పటికీ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే తీసుకుంటాం. అలాగే ప్రొడక్ట్ డెవలప్ మెంట్ విషయంలో అన్ని కంపెనీల కంటే బెటర్ క్వాలిటీని డెవలప్ చేసి అదే ఇస్తున్నాం. కాంపిటీటర్ల కంటే కూడా బెటర్ క్వాలిటీ, బెటర్ సర్వీస్, టైమ్ లీ ప్రాజెక్టు డెలివరీ చేస్తున్నాం. ఈ మూడు పారామీటర్లలో మాకు పోటీయే లేదు.
మీకు ఒక ప్రాజెక్టును అప్పగిస్తే.. మీరు ఎప్పటిలోపు డెలివరీ చేస్తారు?
- వంద ఫ్లాట్లు ఉన్న ప్రాజెక్టును 90 రోజుల్లోగా పెయింటింగ్ చేసి ఇవ్వొచ్చు. అయితే, ఆ ప్రాజెక్టు అప్పటికి అన్ని అంశాల్లోనూ పూర్తయి ఉండాలి. పెయింటింగ్ అనేది లాస్ట్ ఐటం. పెయింటింగ్ పూర్తయితే కస్టమర్ కి తాళం ఇచ్చేయొచ్చు. అందువల్ల ప్రతి క్లయింటుతో, ప్రతి వెండార్ తోనూ మేమే సమన్వయం చేసుకుంటాం. సాధారణంగా ఏ వెండర్ అయినా 50 మంది అవసరమైతే 20 మందినే పెడతారు. కానీ మేం 50 మంది అవసరమైతే అంతమందినీ మొబలైజ్ చేస్తాం. అలా చేస్తేనే ప్రతి ప్రాజెక్టునూ సరైన సమయానికి డెలివరీ చేయగలుగుతాం. ఏడాదన్నిర సమయం పట్టే ప్రాజెక్టు ఏడాదిలోగానే పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. అంటే దాదాపు ఆరు నెలల సమయం ఆదా అవుతుంది. ఆ సమయాన్ని మరో ప్రాజెక్టుకు వినియోగించి రెవెన్యూ పొందే అవకాశం ఉంటుంది.
ఎంత రేంజ్ ఇళ్లకు మీ సేవల్ని అందిస్తారు?
- 50 విల్లాల నుంచి 100 ఫ్లాట్ల పైబడిన ప్రాజెక్టులకు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో రిటైల్ ప్రాజెక్టులకు కూడా సేవలు అందించాలని ఆలోచిస్తున్నాం. ఇందులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. మ్యాన్ పవర్ షిప్టింగ్ లో సమస్యలు వస్తాయి. అందువల్ల ఇంకా అక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణెల్లో మా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
పెయింటింగ్ ఇండస్ట్రీ ఎలా ఉండనున్నది?
- టైల్స్ లో మెటల్ కాంపొనెంట్ 80 శాతం, లేబర్ కాంపొనెంట్ 20 శాతం ఉంటుంది. కానీ పెయింట్స్ లో మెటల్ కాంపొనెంట్ 50 శాతం, లేబర్ కాంపొనెంట్ 50 శాతం ఉంటుంది. మనదేశంలో లేబర్ చాలా చీప్ కాబట్టి.. పెయింటింగ్స్ లో మిషనరీ వంటి టెక్నాలజీ ఇంకా రాలేదు. లేబర్ దొరకనప్పుడు టెక్నాలజీ వైపు వెళ్లక తప్పదు. మరో ఐదేళ్ల వరకు ఆ పరిస్థితి రాదనే చెప్పొచ్చు.
టెక్నో పెయింటింగ్స్ ను ఎలా సంప్రదించాలి?
- రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ కంపెనీల దగ్గరకు మేమే వెళతాం. మా మార్కెటింగ్ టీమ్ వారి దగ్గరకు వెళ్లి శాంపిల్స్ ఇవ్వడం, కొటేషన్ ఇవ్వడం చేస్తుంది. ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ టీమ్ ఆ పని చేయిస్తుంది. తర్వాత క్యూఎస్ టీమ్ బిల్లులు పెట్టుకోవడం వంటివి చేస్తుంది. ఇలా ఓ మోడల్ మేం డెవలప్ చేసుకున్నాం.