దాదాపుగా దశాబ్దం నుంచి ఖాళీగా పడి ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
బండ్ల గూడలో మొత్తం 1501 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయి. అందులో వర్క్స్ పూర్తి స్థాయిలో ఉన్నవి 419 ఫ్లాట్లు చ. అడుగు 3 వేల చొప్పున విక్రయించాలని నిర్ణయించారు. కాస్త అసంపూర్తిగా ఉన్న వాటిని చదరపు అడుక్కీ రూ.2,750 చొప్పున విక్రయిస్తారు. పోచారంలో 1328 ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. వీటిని చదరపు అడుక్కీ రూ. 2500 రూ.చొప్పున అమ్ముతారు. కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లను.. చదరపు అడుక్కీ రూ. 2250 రూ. చొప్పున విక్రయిస్తారు. సాధారణ పౌరులు, ఉద్యోగులు, ఆసక్తి కలిగిన వారు మీ సేవా ద్వారా, ఆన్‌లైనులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంంధించి ప్రత్యక యాప్ కూడా అందుబాటులోకి వస్తుంది. అర్హులైన వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుంది. www.swagruha.telangana.gov.in సైట్ ను పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు విజిట్ చేసి అప్లై చేసుకోవాలి. ఆసక్తి కలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6 చొప్పున మోడల్ హౌసులు ఏర్పాటు చేశారు. వాటిని సందర్శించాక నచ్చితే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు.
* అప్లికేషన్ ఫీజు 1000 రూ.(నాన్ రిఫండబుల్)..
* లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుంది. అందుకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు.
This website uses cookies.