రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతుగా నిలిచేందుకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టాంపు డ్యూటీ తగ్గింపును వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా సమయంలో రియల్ రంగానికి ఊతమిచ్చేందుకు గతేడాది స్టాంపు డ్యూటీలో 2 శాతం, సర్కిల్ రేటులో 10 శాతం రాయితీ ఇచ్చింది. అప్పటి నుంచి రెండు సార్లు పొడిగించగా.. తాజాగా దసరా కానుకగా మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రియల్ ఎస్టేట్ రంగం హర్షం వ్యక్తంచేసింది. ‘స్టాంపు డ్యూటీ, సర్కిల్ రేటులో రాయితీని పొడిగిస్తూ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్గా పూజ బహుమతిగా భావిస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది’ అని క్రెడాయ్ బెంగాల్ అధ్యక్షుడు సుశీల్ మోహతా పేర్కొన్నారు. స్టాంపు డ్యూటీలో 2 శాతం రాయితీని శాశ్వతంగా కొనసాగించాలని కోరుతున్నట్టు చెప్పారు.
This website uses cookies.