Categories: PROJECT ANALYSIS

హైద‌రాబాద్‌లో.. టాప్ స్కై స్క్రేప‌ర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2025

  • రాజపుష్ప ప్రొవిన్షియా @ నార్సింగి
  • పౌలోమీ ప‌లాజో @ కోకాపేట్‌
  • కొల్లూరులో అన్వితా ఇవానా
  • హైటెక్ సిటీలో వాస‌వి స్కైలా

నగరంలో టాప్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలుగా పేరొందిన సంస్థలన్నీ దాదాపు 2 దశాబ్ధాలకు పైగా అనుభవమున్నవే. నిర్మాణ రంగంలోని వివిధ సెగ్మెంట్లలో కన్‌స్ట్రక్షన్స్‌ చేపట్టి సకాలంలో కస్టమర్లకు అందించి వారి నమ్మకాన్ని- అభిమానాన్ని పొందాయ్‌. అలాంటి సంస్థల్లో కొన్నింటి గురించి.. ప్రస్తుతం ఆ కంపెనీలు చేపట్టిన ప్రాజెక్ట్‌లు.. లొకేషన్‌, రెరా అలాట్‌ చేసిన రిజిస్ట్రేషన్‌ నంబర్స్‌ సహా పూర్తి వివరాలు గత వారం అందించాం. హైద్రాబాద్‌లో టాప్‌ ప్రాజెక్ట్స్‌ టు ఇన్వెస్ట్‌ ఇన్‌ 2025 సెగ్మెంట్‌లో మేం సజెస్ట్‌ చేస్తున్న మరికొన్ని ప్రాజెక్ట్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ వారం రాజపుష్ప ప్రొవిన్షియా, పౌలోమీ ప‌లాజో, అన్విత ఇవానా, వాసవీ స్కైలా, ….. కంపెనీలు భాగ్యనగరంలో వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తోన్న లార్జెస్ట్‌ టవర్స్‌ అండ్ గేటెడ్‌ కమ్యూనిటీస్‌ల గురించి తెలుసుకుందాం. రాజపుష్ప ప్రాపర్టీస్‌ నార్సింగిలో రాజపుష్ప ప్రొవిన్షియా ప్రాజెక్ట్‌ చేపట్టింది. కోకాపేటలో పౌలోమీ ప‌లాజో పేరుతో లగ్జరీ ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్ట్‌ చేస్తోంది పౌలోమీ ఎస్టేట్స్‌. కొల్లూరు దగ్గర లగ్జరీ కాన్సెప్ట్‌తో అన్వితా ఇవానాను అందించనుంది అన్వితా గ్రూప్‌. ఇక హైటెక్‌ సిటీ దగ్గర కొత్తగూడలో వాసవీ గ్రూప్‌ వాసవీ స్కైలాని నిర్మిస్తోంది. మ‌రి, ఈ ప్రాజెక్టుల స్పెషాల్టీస్‌ ఏంటి? బిల్డర్ల బ్యాక్ గ్రౌండ్‌తో పాటు ఒక్కో ప్రాజెక్ట్‌లో ఎన్ని ఫ్లాట్స్‌ కడుతున్నారు? ఎప్పుడు హ్యాండోవర్‌ చేస్తారు?

రాజ‌పుష్ప ప్రొవిన్షియా.. నార్సింగికే న‌యా లుక్‌!

గచ్చిబౌలి- ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నియర్‌ బై ఓన్‌ ప్రాపర్టీ కావాలనుకునే వారికి.. ఈ రెండు ప్రాంతాల దగ్గర్లో నివసించాలనుకునే వారికి బెస్ట్‌ ఛాయిస్‌ రాజపుష్ప ప్రొవిన్షియా. లగ్జరీ అండ్‌ ప్రీమియం లైఫ్‌స్టైల్‌ కన్‌స్ట్రక్షన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ రాజపుష్ప ప్రాపర్టీస్‌. నిర్మాణ రంగంలో దాదాపు 2 దశాబ్ధాల అనుభవం. ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించి సక్సెస్‌ఫుల్‌గా కస్టమర్లకు హ్యాండోవర్‌ చేసిన రాజపుష్ప- నార్సింగిలో 23.75 ఎకరాల విశాలమైన ల్యాండ్‌ ఏరియాలో ప్రొవిన్షియా పేరుతో లార్జెస్ట్‌ లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. ఇందులో జీ+39 ఎత్తులో 11 టవర్లు నిర్మించారు. 1370 నుంచి 2660 స్క్వేర్‌ఫీట్స్‌లో టూ బీహెచ్‌కే అండ్ త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌.. మొత్తం 3 వేల 498 అపార్ట్‌మెంట్‌ యూనిట్స్‌ ఉన్నాయ్‌.

లక్షన్నర చదరపు అడుగుల్లో క్లబ్‌ ఒడిస్సీ, క్లబ్‌ ఒయాసిస్‌ పేరుతో రెండు గ్రాండ్‌ క్లబ్‌ హౌస్‌ల్ని ఎక్స్‌క్లూజివ్‌గా ఏర్పాటు చేశారు. స్కై వాక్‌ ఎంట్రన్స్‌, ప్రతీ అపార్ట్‌మెంట్‌కి ఈవీ ఛార్జింగ్‌ సదుపాయం, ట్రాఫిక్‌ ఫ్రీ పోడియం సహా ప్రీమియం లైఫ్‌స్టైల్‌కి బెంచ్‌మార్క్‌ లాంటి అనేక అమెనిటీస్‌ ఇందులో ఉన్నాయ్‌. రెడీ టూ మూవ్‌కి సిద్ధంగా ఉన్న ప్రొవిన్షియాలో ఈ ఏడాది మార్చి నుంచి కస్టమర్లకి ఫ్లాట్లను అందజేయనున్నారు.

పౌలోమీ ప‌లాజో.. కోకాపేట్‌లో 55 అంత‌స్తులు!

2005లో కంపెనీని ఎస్టాబ్లిష్‌ చేసిన దగ్గర్నుంచి రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లో లీడింగ్‌లో ఉంది పౌలోమీ ఎస్టేట్స్‌. కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టు లావిష్‌ అండ్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్న పౌలోమీ నుంచి వస్తోన్న హై రైజ్‌ అపార్ట్‌మెంట్స్‌ ప్రాజెక్ట్‌ పౌలోమీ ప‌లాజో . కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌లో నిర్మిస్తోన్న ఈ స్కై స్క్రేపర్‌లో 55 అంతస్థులున్నాయ్‌. ప్రాజెక్ట్‌ సైజ్‌ విషయానికొస్తే- 2.3 ఎకరాల్లో నిర్మిస్తోన్న ప‌లాజోను సింగిల్‌ బిల్డింగ్‌గా నిర్మిస్తున్నారు. మొత్తం 141 యూనిట్స్‌ ఉండగా.. అన్నీ ఫోర్‌ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్సే.

అడుగడుగునా విలాసం- సౌకర్యానికి మారుపేరుగా ఉంటాయి ఇందులోని లగ్జరీ ఫ్లాట్స్‌. 6 వేల 225 నుంచి 8 వేల 100 చదరపు అడుగుల్లో ఈ యూనిట్స్‌ కన్‌స్ట్రక్ట్‌ అవుతున్నాయ్‌. 2026 డిసెంబర్ నాటికి బయ్యర్లకి ఫ్లాట్స్‌ అందజేస్తామంటోంది పౌలోమీ. వెల్నెస్‌ ఫ్లోర్‌, ఫిట్నెస్‌ ఫ్లోర్‌, రిక్రియేషన్‌ ఫ్లోర్‌లుగా 3 లెవల్స్‌లో క్లబ్‌ పలాజ్జో పేరుతో క్లబ్‌హౌస్‌ సదుపాయాలున్నాయ్‌. 5 ఫ్లోర్ల ఎత్తులో గ్రాండ్‌ లాబీ, 52వ అంతస్థులో టెర్రస్‌ ఇన్ఫినిటీ పూల్‌, స్మార్ట్‌ బిల్డింగ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ లాంటి మోడ్రన్‌ అమెనిటీస్‌ను అందిస్తుంది పౌలోమీ పలాజ్జో. ముఖ్యమైన ఆఫీస్‌ స్పేసెస్‌ అండ్‌ సోషల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ అన్నీ పలాజ్జోకి ఒకటిన్నర నుంచి మూడున్నర కిలోమీటర్ల లోపే ఉన్నాయ్‌.

కొల్లూరులో అన్వితా ఇవానా..

సింగపూర్‌, దుబాయ్‌ల్లో ఇంటీరియర్‌ బిజినెస్‌తో గుర్తింపు పొందారు అన్వితా గ్రూప్‌ సీఎండీ బొప్పన అచ్యుతరావు. ఇంటీరియర్‌తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగు పెట్టిన ఆయన అన్వితా బిల్డర్స్‌ పేరుతో భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిల్లో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రాజెక్ట్‌ అన్వితా ఇవానా. కొల్లూరు వద్ద 2 వేల కోట్ల రూపాయల హ్యుజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో నిర్మిస్తోన్న ఈ లగ్జరీ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లో అనేక విశేషాలున్నాయ్‌. మొత్తం 12.9 ఎకరాల్లో విస్తరించిన ఈ గేటెడ్‌ కమ్యూనిటీని రెండు దశల్లో కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు ఉండే టవర్లు..

అద్భుతమైన ఆర్కిటెక్చర్‌, ప్రత్యేకంగా ప్లాన్‌ చేసిన అపార్ట్‌మెంట్స్‌, వావ్‌ అనిపించే ల్యాండ్‌స్కేప్స్‌ ఓవరాల్‌గా స్పెల్‌ బౌండ్‌ అవ్వాల్సిందే ఇవానా ప్రాజెక్ట్‌ని చూస్తే. మొత్తం 6 టవర్లలో 1700కి పైగా లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను నిర్మిస్తున్నారు. వీటితో పాటు 30 స్కై విల్లాలను.. 40 క్లౌడ్‌ విల్లాస్‌ను కన్‌స్ట్రక్ట్‌ చేస్తోంది అన్వితా గ్రూప్‌. ఇక 2 క్లబ్‌ హౌస్‌ల కోసం లక్ష చదరపు అడుగులు కేటాయించారు. లక్ష స్క్వేర్‌ఫీట్స్‌లో గ్రౌండ్‌ లెవల్‌ అమెనిటీస్‌.. మరో లక్ష ఎస్‌ఎఫ్‌టీల్లో టెర్రస్‌ లెవల్‌ అమెనిటీస్‌ కల్పిస్తున్నారు. ఇవానా నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌, కోకాపేట, నియో పోలీస్‌, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌- 2 లాంటివన్నీ 10 నిమిషాల దూరంలోనే ఉన్నాయ్‌. 2027 నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకొంది అన్వితా గ్రూప్‌.

హైటెక్ సిటీలో.. వాస‌వి స్కైలా..

నిర్మాణరంగంలో త్రీ డికేడ్స్ ఎక్స్‌పీరియన్స్‌తో హైద్రాబాద్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉంది వాసవీ గ్రూప్‌. ఆధునికత- సాంకేతికతను కలిపి రియాల్టీ సెక్టార్‌లో ఎప్పటికప్పడు కొత్త ట్రెండ్స్‌ను పరిచయం చేస్తూ తనకంటూ ప్రత్యేకతను సాధించింది. అందుకే వాసవీ గ్రూప్‌ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ అంటే కస్టమర్లు కూడా విపరీతమైన ఆసక్తి కనబరుస్తుంటారు. ఇటు లగ్జరీ.. అటు కంఫర్ట్‌ని మిక్స్‌ చేసి బయ్యర్ల టేస్ట్‌కు తగ్గట్టు రూపొందిస్తోన్న అపార్ట్‌మెంట్స్‌ వాసవీ స్కైలా. సిటీలో మోస్ట్ వాంటెడ్‌ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్‌- హైటెక్‌ సిటీ సమీపంలో కొలువుదీరింది ఈ ప్రాజెక్ట్‌. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్కైలా గేటెడ్‌ కమ్యూనిటీలో మొత్తం 685 యూనిట్స్‌ ఉన్నాయ్‌. వీటిని 5 టవర్లలో నిర్మిస్తున్నారు. ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్థులున్నాయ్‌.

వాసవీ గ్రూప్‌ నిర్మిస్తోన్న మిగిలిన ప్రాజెక్ట్‌లతో పొల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్‌ అనే చెప్పాలి. రీజన్‌ ఇక్కడ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌, ఫోర్ బీహెచ్‌కే తో పాటు ఫైవ్‌ బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో ఉన్న అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయ్‌. హైద్రాబాద్‌ హార్ట్‌ లాంటి హైటెక్‌సిటీలో ఉండటంతో ఇక్కడ్నుంచి మెట్రో, ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌, హాస్పిటల్స్‌, లైఫ్‌స్టైల్‌ హబ్స్‌, ఐటీ పార్క్స్‌ సహా ఏవైనా ఎక్కువలో ఎక్కువ 5 కిలోమీటర్లలోపే ఉండటం స్కైలా ప్రాజెక్ట్‌ బిగ్గెస్ట్‌ అడ్వాంటేజ్‌. ఇక 50 వేల ఎస్‌ఎఫ్‌టీల్లో క్లబ్‌ హౌస్‌ సహా అనేక మోడ్రన్‌ అమెనిటీస్‌ ఉన్నాయిందులో.

This website uses cookies.