ముంబైకి చెందిన స్టీల్ అండ్ పవర్ కంపెనీ ఎండీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో టాపవర్త్ స్టీల్స్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్, ఎండీ అభయ్ నరేంద్ర లోధాను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. అనంతరం ఆయన్ను ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. సెప్టెంబర్ 8 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చినట్టు తెలిపింది. దాదాపు రూ.3 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంలో లోధాను విచారించనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ముంబై, పుణె, నాగ్ పూర్, దుర్గ్, ఢిల్లీల్లో ఈ కంపెనీకి చెందిన 12 కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది.