రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా టౌన్ షిప్ అభివృద్ధి చేస్తున్న డెవలపర్ కు రెరా గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు రూ.కోటి జరిమానా విధించింది. కేరళ కోడికోడ్ లోని పంతిరంకావ్ పెరుమన్న గ్రామపంచాయతీలో లైఫ్ లైన్ గ్రీన్ సిటీ పేరుతో రియల్ లైన్ ప్రాపర్టీస్ సంస్థ విల్లా, అపార్ట్ మెంట్ ప్రాజెక్టు చేపట్టింది.
అయితే, దీనిని రెరాలో నమోదు చేయకుండానే అమ్మకాలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేరళ రెరా ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. నంతరం రెరా చట్టంలోని సెక్షన్ 59 (1) ప్రకారం రూ.కోటి జరిమానా విధించింది. ఈ ఆదేశాలు అందుకున్న 30 రోజుల్లోగా ఆ ప్రాజెక్టును రెరాలో నమోదు చేయించాలని స్పష్టంచేసింది.
అలాగే అప్పటివరకు రెరా చట్టాన్ని ఉల్లంఘించి జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేస్తూ స్టాప్ మెమో జారీ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది. ఆధార్ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోజికో జిల్లా రిజిస్ట్రార్ కు సూచించింది.
This website uses cookies.