రెజ్ న్యూస్, హైదరాబాద్, 23: అత్యంత ప్రఖ్యాతి గాంచిన ‘ట్రెడా ప్రాపర్టీ షో’ మళ్లీ నగరానికి వచ్చింది. డెవలపర్లు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. హైదరాబాద్, తెలంగాణవ్యాప్తంగా వివిధ రకాల ప్రాప ర్టీలను ఒకే వేదికపై అందిస్తోంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) నేడిక్కడ ట్రె డా ప్రాపర్టీ షో 11వ ఎడిషన్ ను ప్రకటించింది. ఇది హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో 2021 అక్టోబర్ 1 నుంచి 3 వరకు జరుగనుంది.
కొవిడ్ రెండో దశ తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఇది రియల్ ఎ స్టేట్ రంగానికి మరింతగా ఊతమిచ్చింది. పెట్టుబడులు, ప్రతిభ దృష్ట్యా హైదరాబాద్ నేటికీ కార్పొరెట్ ప్రపం చంలో అత్యంత మన్నన కలిగిఉంది. తద్వారా దేశంలో కార్యకలాపాలు ప్రారంభించాలనుకునే ఎన్నో బహు ళ జాతి సంస్థలకు ప్రాథమ్య గమ్యస్థానంగా ఉంటోంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పరిశ్రమ స్నేహ పూర్వక సంస్కరణలు, వినూత్న విధానాలు గణనీయ అభివృద్ధికి దోహదం చేశాయి. రియల్ ఎస్టేట్ రంగం ప్రగతిశీలకపథంలో సాగేందుకు ఇది తోడ్పడింది.
డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లతో కూడిన రియల్ ఎస్టేట్ కమ్యూనిటీచే నిర్వహించబడే ట్రెడా ప్రాపర్టీ షో అ టు విక్రేతలకు, ఇటు కొనుగోలుదారులకు విస్తృతస్థాయిలో ఆస్తులను అమ్మేందుకు, కొనేందుకు గల అవ కాశాలను తెలుసుకునేందుకు, మాట్లాడుకునేందుకు ఏకైక గమ్యస్థానంగా ఉంటోంది. రాబోయే ట్రెడా ప్రాప ర్టీ షో లో 100కు పైగా బిల్డర్లు, డెవలపర్లు, భవన నిర్మాణ సామగ్రి సరఫరాదారులతో పాటుగా పలు ఆర్థిక సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షులు శ్రీ ఆర్ చలపతి రా వు మాట్లాడుతూ, ‘‘ఈ ఏడాది ట్రెడా ప్రాపర్టీ షో 11వ ఎడిషన్ ను నిర్వహించడం మాకెంతో ఆనందదాయ కం. 2020 ప్రారంభం నుంచి, మొదటి రెండు వేవ్ ల సందర్భంగా కొవిడ్ మనల్ని ఎలా ప్రభావితం చేసిం దో, అన్ని రంగాలను ఎలా స్తంభింపజేసిందో మనకు తెలుసు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టీకా కార్యక్రమం జో రందుకున్న నేపథ్యంలో అన్ని రంగాలు, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం తిరిగి సాధారణ స్థితికి చేరు కుంటోంది’’ అని అన్నారు. ‘‘ఇటీవలి కాలంలో హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ బాగా వృద్ధి చెందుతోంది. పండుగ సీజన్ సమీపించిన నేపథ్యంలో తమకు నచ్చిన ఆస్తిని కొనేందుకు ప్రణాళిక రూపొందించుకోవడం, ఇన్వెస్ట్ చేయడం పరిశీ లించేందుకు ఆశావహ కొనుగోలుదారులందరికీ ఇది చక్కటి సమయం. అది స్వల్పకాలికంగానే గాకుండా దీర్ఘకాలికంగా కూడా వారికి లాభదాయకంగా ఉంటుంది’’ అని అన్నారు.
11వ ప్రాపర్టీ షో కు స్పాన్సర్స్:
డైమండ్ స్పాన్సర్ – వాసవి గ్రూప్; ప్లాటినం స్పాన్సర్స్ – అపర్ణ గ్రూప్,360 లైఫ్; గోల్డ్ స్పాన్సర్స్-సుచిరిం డియా గ్రూప్, ఎన్-స్క్వేర్ ప్రాజెక్ట్స్; సిల్వర్ స్పాన్సర్ – సుమధుర గ్రూప్; హాల్ స్పాన్సర్స్ – రాంకీ ఎస్టేట్స్ & ఫార్మ్స్ లిమిటెడ్, సాయి సూర్య డెవలపర్స్; పోర్టల్ భాగస్వామి – 99acres.com ; ఆరోగ్య భాగస్వామి – సన్ షైన్ హెల్త్ కేర్. ఈ షోలో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ నిర్మాణాల్ని ప్రదర్శిస్తాయి. వివిధ తరగతుల కస్టమర్‌లకు అందించే అపార్ట్ మెంట్లు, విల్లాస్, ప్లాట్లు, వ్యవసాయ భూములు వీటిలో ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, ఐఐఎఫ్‌ఎల్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, కెనరా బ్యాంక్ వంటి ప్రసిద్ధ ఆర్థిక సంస్థలు రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి సమగ్రంగా తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తాయి.
ట్రెడా ప్రాపర్టీ షో
తేదీలు: 1 , 2,3 అక్టోబర్ 2021 (ప్రవేశం ఉచితం)
సందర్శన వేళలు: ఉదయం 10:00 గంటలు – రాత్రి 8:00 గంటలు
వేదిక: హాల్ నం. 1 & 3, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్