స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే మధ్యతరగతి ప్రజానీకం.. టీఎస్పీఏ జంక్షన్.. బండ్లగూడ, కిస్మత్ పూర్ వంటి ప్రాంతాలపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ హైదరాబాద్‌లో లభించే ఆధునిక సౌకర్యాల్ని ఈ ప్రాంతవాసులకు అందించాలన్న లక్ష్యంతో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ వంటి సంస్థ బండ్లగూడలో పలు విల్లా, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో ఫ్లాట్లు కొనుక్కున్నవారు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సంస్థ ప్రస్తుతం బోల్డర్ వుడ్స్ అనే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ కమ్యూనిటీలో ఫ్లాట్లు కొనుక్కునే అందరి కోసం ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్‌ని డెవలప్ చేస్తోంది. నిజానికి, ఇలాంటి సౌకర్యం ఏ ప్రాజెక్టులోనూ లేదనే చెప్పాలి. అంతెందుకు, మియాపూర్‌లో ఎస్ఎంఆర్ వినయ్ సిటీ తర్వాత..అంతకంటే అధిక విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న క్రికెట్ గ్రౌండ్ ఇదేనని చెప్పాలి. అందుకే, చాలామంది గృహ యజమానులు ఎస్ఎంఆర్ వినయ్ బోల్డర్ వుడ్స్ వైపు దృష్టి సారిస్తున్నారనే చెప్పాలి.
ఈ ప్రాజెక్టు ఎదురుగానే వైష్ణవీ ఇన్ఫ్రాకాన్.. వైష్ణవీ ఓయాసిస్ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని కొనుగోలుదారులకు విజయవంతంగా అందజేసింది. అందులో కొన్నవారి అభ్యర్థన మేరకు ఇదే బండ్లగూడలో మరో లగ్జరీ ప్రాజెక్టును ఆరంభించింది. దాన్ని పేరే.. వైష్ణవీ హౌడిని. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఆధునికతను కోరుకునేవారి కోసం అత్యద్భుతంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. సరికొత్త గృహ యజమానులకు నప్పే విధంగా ఇందులో టెక్నాలజీకి, సుస్థిరతకు పెద్దపీట వేసింది. నాణ్యమైన జీవన విధానాన్ని కోరుకునేవారి కోసమే హౌడిని తీర్చిదిద్దుతున్నామని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
కిస్మత్ పూర్లో గిరిధారి హోమ్స్ వ్యూ అనే ప్రాజెక్టును ఆరంభించింది. ప్రకృతికి చేరువగా ఉండాలని భావించేవారికి తమ వ్యూ నచ్చతుందని సంస్థ చెబుతోంది. ఇందులో 216 ఫ్లాట్లలో ఇప్పటికే 39 ఫ్లాట్లను విక్రయించింది. పిరంచెరువు వద్ద పీబీఈఎల్ సిటీ రెండు టవర్లను నిర్మిస్తోంది. వీటిలో సుమారు 395 ఫ్లాట్లు దాకా వస్తాయి. ఇదో బడా గేటెడ్ కమ్యూనిటీ కావడంతో ఇందులోని ఆధునిక సౌకర్యాలు అదే విధంగా ఉంటాయి. ఇప్పటికే వందలాది కుటుంబాలు ఇందులోని పలు టవర్లలో నివసిస్తున్నారు.